భక్తులకు మౌలిక వసతులు కల్పించాలి | - | Sakshi
Sakshi News home page

భక్తులకు మౌలిక వసతులు కల్పించాలి

Feb 10 2026 7:12 AM | Updated on Feb 10 2026 7:12 AM

భక్తులకు మౌలిక వసతులు కల్పించాలి

భక్తులకు మౌలిక వసతులు కల్పించాలి

భక్తులకు మౌలిక వసతులు కల్పించాలి

హన్మకొండ కల్చరల్‌: మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భక్తులకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించాలని రాష్ట్ర దేవాదాయశాఖ ధర్మాదాయశాఖ రీజినల్‌ జాయింట్‌ కమిషనర్‌ మల్లెల రామకృష్ణారావు ఆదేశించారు. సోమవారం హనుమకొండలోని వేయిస్తంభాల ఆలయాన్ని ఆయన సందర్శించారు. ఈసందర్భంగా ఆలయ ఈఓ అనిల్‌కుమార్‌, ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ ఆయనను ఆలయ మర్యాదలతో స్వాగతించారు. పూజల అనంతరం దేవాలయంలో ఈ నెల 14 నుంచి 18వరకు జరిగే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై అధికారులతో కలిసి ఆయన సమీక్షించారు. ఆ సందర్భంగా ఆర్జేసీ మాట్లాడుతూ.. బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు క్యూలైన్లు, తాగునీరు, చలువ పందిళ్లు ఏర్పాటు చేయాలని, ధార్మిక భావన కలిగిన కళాకారులతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలని ఈఓను ఆదేశించారు. కార్యక్రమంలో దేవాలయ సిబ్బంది మధుకర్‌, రామకృష్ణ, రజిత, వేదపండితుడు మణికంఠశర్మ, అర్చకులు ప్రణవ్‌, కాళిలింగాచారి పాల్గొన్నారు.

ఆర్జేసీ మల్లెల రామకృష్ణారావు

మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల

ఏర్పాట్లపై సమీక్ష

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement