నువ్వా.. నేనా.. అంటున్న అభ్యర్థులు.. ఓట్ల కోసం ఎర వేస్తున్న పార్టీలు | - | Sakshi
Sakshi News home page

నువ్వా.. నేనా.. అంటున్న అభ్యర్థులు.. ఓట్ల కోసం ఎర వేస్తున్న పార్టీలు

Feb 10 2026 7:12 AM | Updated on Feb 10 2026 7:12 AM

నువ్వ

నువ్వా.. నేనా.. అంటున్న అభ్యర్థులు.. ఓట్ల కోసం ఎర వేస్త

న్యూస్‌రీల్‌

ఆఖరు

రోజు

ప్రచార

హోరు

మంగళవారం శ్రీ 10 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026

సాక్షిప్రతినిధి, వరంగల్‌:

హోరెత్తిన మున్సిపల్‌ ఎన్నికల ప్రచారం ఒక్కసారిగా ఆగిపోయింది. సోమవారం సాయంత్రం 5 గంటలకు అభ్యర్థులు ప్రచారానికి తెరవేశారు. పట్టణాల్లో సాగిన, మైకుల మోత, ప్రచారహోరు మూగబోయింది. మున్సిపల్‌ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ తర్వాత సుమారు వారం రోజులుగా అభ్యర్థులు.. ప్రధాన పార్టీల నాయకులు విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఉమ్మడి వరంగల్‌లోని 12 మున్సిపాలిటీల్లో 260 వార్డులకు 1,073 మంది పోటీ చేస్తుండగా.. ఒక్కో వార్డు నుంచి సగటున నలుగురైదుగురు ఉన్నారు. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌, బీజేపీ పార్టీల తరఫున ఆ పార్టీల అగ్రనాయకులు ప్రచారం నిర్వహించగా.. సీపీఐ, సీపీఎం, బీఎస్పీ, ఎఐఎఫ్‌బీ, రెబల్స్‌, ఇండిపెండెట్లు కూడా ప్రచారం సాగించారు. అయితే ఎన్నికల నిబంధనల ప్రకారం.. సోమవారం సాయంత్రం 5 గంటలకు ప్రచారం ముగించడంతో ఒక్కసారిగా పట్టణాల్లో మైకుల మోత ఆగిపోయింది.

పోలింగ్‌ కేంద్రాలకు

నేడు అధికారులు, సిబ్బంది

మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్‌ ఈ నెల 11న ఉదయం 7 గంటల నుంచి మొదలు కానుంది. ఈ మేరకు ఎన్నికల్లో పాల్గొనే అధికారులు, సిబ్బంది మంగళవారం మధ్యాహ్నం డిస్ట్రిబ్యూషన్‌ సెంటర్ల నుంచి పోలింగ్‌ సామగ్రితో పోలింగ్‌ కేంద్రాలకు చేరుకోనున్నారు. ఇటీవల రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించిన వివరాల ప్రకారం 12 మున్సిపాలిటీల్లో 3,35,244 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో మహిళలు 1,72,087లు కాగా, పురుషులు 1,63,088లు. ఆ మేరకు పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేయగా.. డిస్ట్రిబ్యూషన్‌ కేంద్రాల నుంచి అధికారులు, సిబ్బందిని తరలించేందుకు సర్వం సిద్ధమైంది.

మున్సిపల్‌ ఎన్నికల ప్రచారం ముగింపునకు ఒక్కరోజు ముందునుంచే ఆయా పార్టీల అగ్రనేతలు, అభ్యర్థులు ప్రచారంలో హోరెత్తించారు. కాంగ్రెస్‌ పార్టీ నుంచి సీఎం రేవంత్‌ రెడ్డి, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి, పొన్నం ప్రభాకర్‌, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, ధనసరి సీతక్క తదితరులు ప్రచారం నిర్వహించారు. ఎంపీ డాక్టర్‌ కడియం కావ్య, ఎమ్మెల్యేలు కూడా విస్తృతంగా పర్యటించారు. బీఆర్‌ఎస్‌ నుంచి ఆ పార్టీ రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌, మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్‌, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు దాస్యం వినయ్‌భాస్కర్‌, అరూరి రమేశ్‌, చల్లా ధర్మారెడ్డి తదితరులు ఆయా నియోజకవర్గాల పరిధి మున్సిపాలిటీల్లో ప్రచారం చేశారు. బీజేపీ నుంచి రాష్ట్ర, జిల్లా నాయకులు జె.హుస్సేన్‌ నాయక్‌, డాక్టర్‌ కాళీప్రసాద్‌, చందుపట్ల కీర్తిరెడ్డి తదితరులు అభ్యర్థుల తరఫున ప్రచారంలో తిరిగారు. అయితే సోమవారం సాయంత్రం ఎన్నికల ప్రచారం ముగియనుండడంతో మున్సిపాలిటీ ఓటర్లను ప్రలోభాలకు గురి చేసేందుకు పంపిణీ కార్యక్రమానికి పార్టీలు సోమవారం రాత్రినుంచే తెర తీశాయి. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ పార్టీలు ఓటర్లకు ఓటుకు రూ.1,000 నుంచి రూ.2,500.. మద్యం, మాంసం కూడా సరఫరా చేయడం చర్చనీయాంశంగా మారింది.

హన్మకొండ అర్బన్‌: మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్‌ ప్రక్రియను పురస్కరించుకుని రాష్ట్ర ఎన్నికల సంఘం నియమావళిని కట్టుదిట్టంగా అమలు చేయనున్నట్లు హనుమకొండ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ స్నేహ శబరీష్‌ తెలిపారు. పరకాల మున్సిపల్‌ పరిధిలో ఈ నెల 9వ తేదీ (సోమవారం) సాయంత్రం 5 గంటల నుంచి ఎన్నికల ప్రచార కార్యక్రమాలపై నిషేధం అమలులోకి వస్తుందని, ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు ఆంక్షలు కొనసాగుతాయని స్పష్టం చేశారు.

48 గంటలు సైలెన్స్‌ పీరియడ్‌

పోలింగ్‌కు ముందు 48 గంటల సైలెన్స్‌ పీరియడ్‌ సమయంలో పరకాల పట్టణ పరిధిలో ఎవరూ బహిరంగ ఎన్నికల ప్రచారం నిర్వహించరాదని కలెక్టర్‌ సూచించారు. ఈ నిబంధనలు పక్కాగా అమలు చేయాలన్నారు. ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ టీములు, స్టాటిక్‌ సర్వైలెన్స్‌ టీములు, మోడల్‌ కోడ్‌ ఆఫ్‌ కండక్ట్‌ బృందాలు, పోలీస్‌ అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.

మద్యం దుకాణాలు బంద్‌..

మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్‌ దృష్ట్యా ఈ నెల 9వ తేదీ (సోమవారం) సాయంత్రం 5 గంటల నుంచి 11వ తేదీ పోలింగ్‌ ముగిసేంత వరకు మద్యం దుకాణాలు, కల్లు దుకాణాలను పూర్తిగా మూసివేయాలని సంబంధిత అధికారులను కలెక్టర్‌ ఆదేశించారు. అలాగే ఓట్ల లెక్కింపు ప్రక్రియ నిర్వహించే ఈ నెల 13న కూడా మద్యం, కల్లు దుకాణాలు మూసేయాలని తెలిపారు.

మూడో విడత ర్యాండమైజేషన్‌ పూర్తి

జిల్లాలోని పరకాల మున్సిపల్‌ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల సిబ్బంది మూడో విడత ర్యాండమైజేషన్‌ ప్రక్రియను సోమవారం హనుమకొండ కలెక్టరేట్‌లో హనుమకొండ జిల్లా ఎన్నికల పరిశీలకులు కె.శివకుమార్‌ నాయుడు, హనుమకొండ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ స్నేహ శబరీష్‌ సమక్షంలో నిర్వహించారు. పరకాల మున్సిపాలిటీలోని మొత్తం 22 వార్డులకు 44 పోలింగ్‌ కేంద్రాలు ఉండగా.. 44 మంది పోలింగ్‌ అధికారులు, అదనంగా 20 శాతం రిజర్వుతో కలిపి మొత్తం 53 మందిని కేటాయించారు. అవసరాల దృష్ట్యా రిజర్వు సిబ్బందిని కూడా ర్యాండమైజేషన్‌ ద్వారా కేటాయించారు. కార్యక్రమంలో పరకాల మున్సిపల్‌ కమిషనర్‌ అంజయ్య, టౌన్‌ ప్లానింగ్‌ అధికారి సుష్మ తదితరులు పాల్గొన్నారు.

ర్యాండమైజేషన్‌లో పాల్గొన్న జిల్లా ఎన్నికల అధికారికె.శివకుమార్‌ నాయుడు, అధికారులు

గెలుపోటములపై లెక్కలు.. విజయమే లక్ష్యంగా పావులు

ఆఖరి రోజు హోరెత్తిన ప్రచారం.. రేపు మున్సిపల్‌ పోలింగ్‌

నేడు డిస్ట్రిబ్యూషన్‌ సెంటర్ల నుంచి పోలింగ్‌ కేంద్రాలకు

సామగ్రి, సిబ్బంది

ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని ఆయా మున్సిపాలిటీల్లో డిస్ట్రిబ్యూషన్‌ సెంటర్లు

మున్సిపాలిటీ డిస్టిబ్య్రూషన్‌సెంటర్‌

పరకాల గణపతి డిగ్రీ కాలేజీ

నర్సంపేట ఏఎంసీ, నర్సంపేట

వర్ధన్నపేట మున్సిపల్‌ ఆఫీస్‌

జనగామ ఏకశిల బీఈడీ కాలేజీ

స్టేషన్‌ఘన్‌పూర్‌ సోషల్‌ వెల్ఫేర్‌ స్కూల్‌

భూపాలపల్లి సింగరేణి ఫంక్షన్‌ హాల్‌

మహబూబాబాద్‌ ప్రభుత్వ డిగ్రీ కాలేజీ

డోర్నకల్‌ నిర్మల హైస్కూల్‌

కేసముద్రం ఏఎంసీ, కేసముద్రం

మరిపెడ సెయింట్‌ అగస్టిన్స్‌ హై

తొర్రూరు ఆర్యభట్ట హై స్కూల్‌

ములుగు ములుగు ప్రభుత్వ డిగ్రీ కాలేజీ

నువ్వా.. నేనా.. అంటున్న అభ్యర్థులు.. ఓట్ల కోసం ఎర వేస్త1
1/2

నువ్వా.. నేనా.. అంటున్న అభ్యర్థులు.. ఓట్ల కోసం ఎర వేస్త

నువ్వా.. నేనా.. అంటున్న అభ్యర్థులు.. ఓట్ల కోసం ఎర వేస్త2
2/2

నువ్వా.. నేనా.. అంటున్న అభ్యర్థులు.. ఓట్ల కోసం ఎర వేస్త

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement