పట్టుబడిన వాహనాలు తీసుకెళ్లండి: సీపీ | - | Sakshi
Sakshi News home page

పట్టుబడిన వాహనాలు తీసుకెళ్లండి: సీపీ

Feb 10 2026 7:12 AM | Updated on Feb 10 2026 7:12 AM

పట్టుబడిన వాహనాలు తీసుకెళ్లండి: సీపీ

పట్టుబడిన వాహనాలు తీసుకెళ్లండి: సీపీ

పట్టుబడిన వాహనాలు తీసుకెళ్లండి: సీపీ పీజీ సెమిస్టర్‌ పరీక్షల ఫలితాలు విడుదల టూరిజం కోర్సుల అధ్యయనంతో ఉపాధి సమగ్ర శిక్ష ఎఫ్‌ఏఓ మధుసూదన్‌ సరెండర్‌

వరంగల్‌ క్రైం: వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో వివిధ ఘటనల్లో పోలీసులు స్వాధీనం చేసుకున్న వాహనాలను యజమానులకు అప్పగించడానికి నిర్ణయించినట్లు వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ సన్‌ ప్రీత్‌ సింగ్‌ తెలిపారు. పలు కేసుల్లో స్వాధీనం చేసుకున్న వాహనాలను భీమారం, సీఆర్పీఎఫ్‌ కేంద్రంలో భద్రపర్చినట్లు వివరించారు. వాటిని పోలీస్‌ స్టేషన్ల వారీగా గుర్తించి సంబంధిత వాహన యజమానులకు నోటీసులు పంపినట్లు తెలిపారు. ఆధారాలతో వచ్చిన యజమానులకు వాహనాలు తిరిగి అందజేయనున్నట్లు వివరించారు. మరింత సమాచారం కోసం సీసీఆర్‌బీ ఏసీపీ డేవిడ్‌ రాజ్‌, ఎంటీఓ రిజర్వ్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్రీధర్‌ 87126 85158, సీసీఆర్‌బీ ఇన్‌స్పెక్టర్‌ మల్లయ్య 80083 89789 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.

విద్యారణ్యపురి: హనుమకొండలోని ప్రభుత్వ పింగిళి మహిళా డిగ్రీ అండ్‌ పీజీ కళాశాలలో పీజీ కోర్సుల మూడో సెమిస్టర్‌ పరీక్షల ఫలితాలను సోమవారం ఆకళాశాల ప్రిన్సిపాల్‌ ఆచార్య బి.చంద్రమౌళి విడుదల చేశారు. పీజీ కోర్సుల్లో మూడో సెమిస్టర్‌లో 141 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా, అందులో 130 మంది ఉత్తీర్ణత (92శాతం) సాధించినట్లు చంద్రమౌళి తెలిపారు. కార్యక్రమంలో పరీక్షల నియంత్రణాధికారి సుహాసిని, అదనపు పరీక్షల నియంత్రణాధికారి కొలిపాక శ్రీనివాస్‌, వివిధ విభాగాల అఽఽధిపతులు పి.రాజిరెడ్డి, డాక్టర్‌ రామకృష్ణారెడ్డి సురేశ్‌బాబు, సునీత, రేణుక, సారంగపాణి ఇతర అధ్యాపకులు పాల్గొన్నారు.

కేయూ రిటైర్డ్‌ ప్రొఫెసర్‌ విజయబాబు

కేడీసీలో సర్టిఫికెట్‌ కోర్సు ప్రారంభం

విద్యారణ్యపురి: టూరిజం కోర్సుల అధ్యయనంతో విద్యార్థులు ఉపాధి అవకాశాలు పెంచుకోవాలని కేయూ హిస్టరీ అండ్‌ టూరిజం మేనేజ్‌మెంట్‌ విభాగం రిటైర్డ్‌ ఆచార్యులు విజయబాబు అన్నారు. సోమవారం హనుమకొండలోని కాకతీయ ప్రభుత్వ కళాశాలలో చరిత్ర విభాగం ఆధ్వర్యంలో ‘టూరిస్ట్‌ ప్లేసెస్‌ ఇన్‌ తెలంగాణ’ సర్టిఫికెట్‌ కోర్సును బీసీ విద్యార్థులకు ప్రవేశపెట్టారు. ఈసందర్భంగా నిర్వహించిన సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడుతూ.. టూరిజంను స్మోక్‌ లెస్‌ ఇండస్ట్రీగా అభివర్ణించారు. టూరిజం అభివృద్ధితో ఉపాధి అవకాశాలు పెరుగుతాయని అన్నారు. కాగా, ప్రొఫెసర్‌ విజయబాబును అధ్యాపకులు సన్మానించారు. ఈ సమావేశంలో ఆ కళాశాల వైస్‌ ప్రిన్సిపాల్‌ రజనీలత, అధ్యాపకులు డాక్టర్‌ రాజశేఖర్‌, డాక్టర్‌ ఎ.శ్రీనాఽథ్‌, చరిత్ర విభాగం అధిపతి ఇందిరా దేవి, ఎస్‌.సమ్మయ్య, రామ్‌రెడ్డి, బి.రమేశ్‌ తదితరులు పాల్గొన్నారు.

విద్యారణ్యపురి: హనుమకొండ డీఈఓ కార్యాలయం సమగ్ర శిక్షలో ఫైనాన్స్‌, అ కౌంట్స్‌ ఆఫీసర్‌గా (ఎఫ్‌ఏఓ) డిప్యుటేషన్‌పై(ఫారిన్‌ సర్వీ స్‌) పని చేస్తున్న మధుసూదన్‌ (జేఏఓ)ను తెలంగాణ పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌ /సమగ్రశిక్ష రాష్ట్ర ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌కు సెరెండర్‌ చేస్తూ కలెక్టర్‌ స్నేహ శబరీష్‌ ఈనెల 7న ఉత్తర్వులు జారీ చేశారు. డీఈఓ ని యమించిన విచారణ కమిటీ నివేదిక ప్రకారం మధుసూదన్‌ సేవలు సంతృప్తికరంగా లేవని ప్రాథమికంగా నిర్ధారణ అయ్యింది. మధుసూదన్‌ తక్షణమే పాఠశాల విద్యాశాఖ డైరెక్టరేట్‌ సమగ్రశిక్ష ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ కార్యాలయంలో రిపోర్ట్‌ చేయాలని కలెక్టర్‌ ఆదేశించారు. కాగా, డీఈఓ ఎల్‌వీ గిరిరాజ్‌గౌడ్‌ సోమవారం మధుసూదన్‌ను విధుల నుంచి రిలీవ్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అదేవిధంగా డీఈఓ కార్యాలయం సమగ్ర శిక్షలో ఫైనాన్స్‌ అకౌంట్‌ ఆఫీసర్‌గా (ఫుల్‌ అడిషనల్‌ చార్జ్‌గా) హసన్‌పర్తి మండలం భీమారంలోని జిల్లా పరిషత్‌ హైస్కూల్‌ పీజీహెచ్‌ఎం, హసన్‌పర్తి మండల ఇన్‌చార్జ్‌ విద్యాశాఖాఽధికారిగా బాధ్యతలను నిర్వర్తిస్తున్న ఎ.శ్రీనివాస్‌ను నియమిస్తూ సోమవారం ఉత్తర్వులు జారీచేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement