దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలి | - | Sakshi
Sakshi News home page

దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలి

Feb 11 2026 8:57 AM | Updated on Feb 11 2026 8:57 AM

దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలి

దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలి

ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు చెన్నకేశవులు

నెక్కొండ: దేశవ్యాప్తంగా ఈ నెల 12న నిర్వహించే సమ్మెను జయప్రదం చేయాలని ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు కందిక చెన్నకేశవులు కోరారు. ఈ మేరకు మంగళవారం స్థానిక వ్యవసాయ మార్కెట్‌ కార్యదర్శి కృష్ణమీనన్‌రావుకు సమ్మె నోటీస్‌ హమాలీ కార్మికుల ఆధ్వర్యంలో అందించారు. ఈ సందర్భంగా చెన్నకేశవులు మాట్లాడుతూ కార్మిక వర్గాలు పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను రద్దు చేసి అదానీ, అంబానీ కార్పొరేట్‌ సంస్థలకు అనుకూల చట్టాలను తీసుకొచ్చారని ఆరోపించారు. కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్‌ కోడ్‌లతో కార్మికులకు తీరని అన్యాయం జరుగుతుందన్నారు. కార్మికుల చట్టాలను యథావిధిగా కొనసాగించేంత వరకు దశలవారీగా పోరాటాలు ఉధృతం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో హమాలీ కార్మికులు తోట వెంకన్న, మనుబోతుల యాకాంబ్రం, కూస వెంకన్న, ఉసిల్ల నర్సయ్య, చీరబోయిన సంతోష్‌, తోట మహేందర్‌, అందె స్వామి, కోరే రవి, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement