అధికారులు సమన్వయంతో పనిచేయాలి
నర్సంపేట/వర్ధన్నపేట: అధికారులు సమన్వయంతో పనిచేయాలని, ఎన్నికల సామగ్రి పంపిణీ, స్వీకరణ ప్రక్రియలు సజావుగా, ఇబ్బందులు లేకుండా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డాక్టర్ సత్యశారద ఆదేశించారు. ఈ మేరకు నర్సంపేట, వర్ధన్నపేటలోని డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలను మంగళవారం పరిశీలించారు. పోలింగ్ సిబ్బందికి బ్యాలెక్ బాక్సులు, బ్యాలెట్ పేపర్లు, తదితర ఎన్నిక ల సామగ్రి క్రమబద్ధంగా అందేలా చూడాలన్నారు. ప్రతీ బ్యాలెట్ బండిల్‌పై సీల్, అధికారుల సంతకాలు తప్పనిసరిగా ఉండేలా ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. సిబ్బందికి తాగునీటి వసతి, వైద్యశిబిరం, అల్పాహారం, భోజన వసతి, షామియానాలు తదితర అన్ని మౌలిక సదుపాయాలు పకడ్బందీగా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఏమైన సమస్యలు తలెత్తిన సందర్భంలో వెంటనే తన దృష్టికి తీసుకురావాలన్నారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ రామ్‌రెడ్డి, ఆర్డీఓ సుమా, డీబీసీడీఓ పుష్పలత, మున్సిపల్ కమిషనర్ భాస్కర్, ఎన్నికల అధికారులు, రెవెన్యూ, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. కాగా ఏసీపీ అంబటి నర్సయ్య, సీఐ శ్రీనివాసరావు, ఎస్సైలు సాయిబాబు, రాజు, సిబ్బందితో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.
జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సత్యశారద
వర్ధన్నపేట, నర్సంపేటలోని డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల పరిశీలన


