నేడే పేట పురపోరు | - | Sakshi
Sakshi News home page

నేడే పేట పురపోరు

Feb 11 2026 8:57 AM | Updated on Feb 11 2026 8:57 AM

నేడే

నేడే పేట పురపోరు

IIలో

నర్సంపేటలో 30 వార్డులు, వర్ధన్నపేటలో 12 వార్డులకు పోలింగ్‌

ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఓటింగ్‌

51,494 మంది ఓటర్ల చేతిలో 170 మంది అభ్యర్థుల భవితవ్యం

ఇప్పటికే ఇంటింటికీ వెళ్లి

ఓటర్లను కలిసి ప్రలోభాల పర్వం

ఎక్కడైనా గొడవలు జరిగితే రీ పోలింగ్‌కు అవకాశం

సాక్షి, వరంగల్‌: జిల్లాలోని నర్సంపేటలోని 30 వార్డులు, వర్ధన్నపేట మున్సిపాలిటీలోని 12 వార్డులకు బుధవారం పోలింగ్‌ జరగనుంది. ఇన్నాళ్లు ప్రచారం చేసిన నేతల భవితవ్యం ఓటర్లు బ్యాలెట్‌ బాక్స్‌ల్లో నిక్షిప్తం చేయనున్నారు. ఈ రెండు మున్సిపాలిటీల్లోని 42 వార్డులకు ఉదయం 7 నుంచి సాయంత్రం 5గంటల వరకు జరగనున్న ఎన్నికల్లో 51,494 మంది ఓటు వినియోగించుకోనున్నారు. ఈ పోటీల్లో వంద మంది మహిళలు పోటీలో ఉంటే 70 మంది పురుషులు అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఈ 170 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని నిర్ణయించే 51,494 మంది ఓటర్లలో ఎక్కువగా 26,739 మంది మహిళల ఉండడంతో వారి ఓటు నిర్ణయాత్మకం కానుంది. నర్సంపేట చైర్మన్‌ బీసీ మహిళ రిజర్వేషన్‌, వర్ధన్నపేట చైర్మన్‌ జనరల్‌ రిజర్వేషన్‌ కావడంతో ఆయా మున్సిపాలిటీల్లో ఈ చైర్మన్‌ గిరిని ఆశించే అభ్యర్థులు ఒక పార్టీ నుంచి ఇద్దరు ఉండడంతో ఆయా వార్డుల్లో రాజకీయ పండుగ వాతావరణం ఉంది. ఇతర వార్డుల్లోనూ గెలుపే లక్ష్యంగా అన్ని పార్టీల అభ్యర్థులు విజయాన్ని సవాల్‌గా తీసుకెళ్లి ముందుకెళ్తున్నారు. నేడు జరిగే ఎన్నికల్లో ఎక్కడైనా గొడవలు జరిగి రీ పోలింగ్‌ తప్పదనుకుంటే గురువారం నిర్వహిస్తారు. వర్ధన్నపేట మున్సిపాలిటీ కార్యాలయంలో, నర్సంపేటలోని వ్యవసాయ మార్కెట్‌ యార్డులకు బ్యాలెట్‌ బాక్స్‌లు తరలించి శుక్రవారం లెక్కించనున్నారు.

పోలింగ్‌ శాతం పెంచేందుకు..

ఎన్నికల్లో పోలింగ్‌ శాతం పెంచేందుకు జిల్లాలో వినూత్న కార్యక్రమం చేపట్టారు. నర్సంపేట, వర్ధ న్నపేట మున్సిపాలిటీల్లో హరిత, సాలిడ్‌ వెస్ట్‌ మేనే జ్‌మెంట్‌ పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు.

పగటిపూటే పంపిణీ..

ఇటు నర్సంపేట, అటు వర్ధన్నపేట మున్సిపాలిటీల్లో ఓటర్లను అన్ని పార్టీల నేతలు ప్రసన్నం చేసుకున్నారు. ఎప్పుడైనా ఎన్నికల సమయంలో రాత్రిపూటనే ఎక్కువగా నగదు, మద్యం, చీరలతో పాటు ఇతర బహుమతులు పంపిణీ చేసే నేతలు ఈసారి ఎంచక్కాగా మంగళవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు కార్యక్రమాన్ని ముగించేశారు. సాధారణ వార్డుల్లో రూ.వెయ్యి నుంచి రూ.2,500 వేల వరకు ఓటుకు పంపిణీ చేస్తే, చైర్మన్‌ పీఠం ఆశిస్తున్న వార్డుల్లో మాత్రం రూ.3 వేల నుంచి రూ.5వేల వరకు ఓటుకు ఖరీదు కట్టారు.

అసలు డబ్బే చిక్కలేదు..

నర్సంపేట, వర్ధన్నపేట మున్సిపల్‌ ఎన్నికల్లో నిఘా కోసం నియమించిన ఆరు స్టాటిక్‌ సర్వైలైన్స్‌ టీమ్స్‌, నాలుగు ఫ్లయింగ్‌ స్వ్కా డ్‌లకు అసలే డబ్బే చిక్కలేదు. మొత్తం 42 వార్డుల్లో గెలవాలన్న తలంపుతో అభ్యర్థులు ఎక్కడా తగ్గకుండా ప్రలోభాలకు తెరలేపినా ఒక్క రూపాయి కూడా ఈ బృందాలకు దొరకలేదు. ఇదిలాఉండగా ముగ్ధుంపుర వాసి గొర్రె ఉపేందర్‌ ఇంట్లో రూ.6,200ల విలువ చేసే ఆరు బీర్‌ బాటిల్స్‌, 750 మిల్లీలీటర్ల ఐదు లిక్కర్‌ బాటిల్స్‌ను ఫ్లయింగ్‌ స్వ్కాడ్‌ టీమ్‌ ఈ నెల 6న స్వాధీనం చేసుకొని ఎకై ్సజ్‌ డిపార్ట్‌మెంట్‌కు అప్పగించారు. మరోవైపు పోలీసులు రూ.1,06,071 విలువైన మద్యం స్వాధీనం చేసుకున్నారు.

ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి

జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ సత్యశారద

న్యూశాయంపేట: జిల్లాలోని నర్సంపేట, వర్ధన్నపేట మున్సిపాలిటీల్లో నేడు (బుధవారం) జరగనున్న ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి చేశామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ డాక్టర్‌ సత్యశారద తెలిపారు. మంగళవారం కలెక్టర్‌ మాట్లాడుతూ అన్నిశాఖల అ ధికారులు సమన్వయంతో ఎన్ని కలను విజయవంతం చేయాలని కో రారు. ఆయా పోలింగ్‌ కేంద్రాల్లో మౌలిక సదు పాయాలు కల్పించాలన్నారు. ఓటర్లు పోలింగ్‌ కేంద్రానికి వెళ్లేటప్పుడు ఎన్నికల కమిషన్‌ అనుమతించిన ఏదైన గుర్తింపు కార్డును తీసుకెళ్లాలన్నారు. ప్రజలు, రాజకీయ పార్టీలు, అ భ్యర్థులు, అధికార యంత్రాంగం సమన్వయంతో పనిచేసి ఎన్నికలు విజయవంతంగా నిర్వహించేందుకు సహకరించాలన్నారు.

ఓటేసేందుకు 18 కార్డులు.. మున్సిపల్‌ ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు

పోలీస్‌ కమిషనర్‌ సన్‌ప్రీత్‌సింగ్‌

నేడే పేట పురపోరు1
1/3

నేడే పేట పురపోరు

నేడే పేట పురపోరు2
2/3

నేడే పేట పురపోరు

నేడే పేట పురపోరు3
3/3

నేడే పేట పురపోరు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement