రుద్రేశ్వరాలయంలో బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు | - | Sakshi
Sakshi News home page

రుద్రేశ్వరాలయంలో బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు

Feb 7 2026 3:13 PM | Updated on Feb 7 2026 3:13 PM

రుద్రేశ్వరాలయంలో బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు

రుద్రేశ్వరాలయంలో బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు

రుద్రేశ్వరాలయంలో బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు 9, 10 తేదీల్లో సీఎం కప్‌ జిల్లా స్థాయి పోటీలు విద్యార్థులు పారిశ్రామిక వేత్తలుగా ఎదగాలి సీఓఈ కళాశాలల్లో ప్రవేశానికి రేపే గడువు

హన్మకొండ కల్చరల్‌: వేయిస్తంభాల ఆలయంలో ఈ నెల 14వ తేదీ నుంచి 18వ తేదీ వరకు నిర్వహించనున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు దేవాదాయశాఖ వరంగల్‌ జోన్‌ డిప్యూటీ కమిషనర్‌ రామల సునీత తెలిపారు. శుక్రవారం ఆలయ ప్రాంగణంలో ఆలయ ఈఓ అనిల్‌కుమార్‌ ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మతో కలిసి వేయిస్తంభాల ఆలయ మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికను డీసీ రామల సునీత ఆవిష్కరించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. శివరాత్రి ఉత్సవాలకు లక్షలాది మంది దేవాలయానికి వస్తారని, భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా నగరపాలక సంస్థ, విద్యుత్‌శాఖ, పోలీస్‌శాఖ, రెవెన్యూ శాఖ, దేవాదాయశాఖ, పురావస్తుశాఖల అధికారులు సమన్వయంతో అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు. ఈఓ అనిల్‌కుమార్‌, ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ శివరాత్రి ఉత్సవాల్లో ఐదురోజులు జరిగే పూజా కార్యక్రమాల వివరాలు వెల్లడించారు. కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం నాయకులు గట్టు మహేశ్‌బాబు, బ్రాహ్మణ సేవా సమితి నాయకులు అ యినవోలు వెంకటసత్యమోహన్‌, మున్నూరు కాపు సంఘం నాయకులు గండ్రతి రాజు, పద్మశాలి సంఘం నాయకులు గణపతి, వెలమ సంఘం నాయకులు సంపత్‌రావు, సిబ్బంది మ ధుకర్‌, రామకృష్ణ, సందీప్‌శర్మ పాల్గొన్నారు.

వరంగల్‌ స్పోర్ట్స్‌: ఈ నెల 9, 10 తేదీల్లో హనుమకొండలోని జవహర్‌లాల్‌ నెహ్రూ స్టేడియంలో జిల్లా స్థాయి సీఎం కప్‌ క్రీడా పోటీలు నిర్వహిస్తున్నట్లు హనుమకొండ డీవైఎస్‌ఓ గుగులోతు అశోక్‌కుమార్‌ శుక్రవారం తెలిపారు. రెండు రోజుల పాటు జరగనున్న పోటీల్లో పాల్గొనే క్రీడాకారులు ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ పత్రంతో పా టు, సంబంధిత ఎంపీడీఓ లేదా ఎంఈఓ ధ్రువీ కరించిన ప్రవేశ ఫామ్‌తో ఉదయం 8గంటలకు జేఎన్‌ఎస్‌ వద్ద హజరు కావాలని కోరారు.

కేయూ క్యాంపస్‌: విద్యార్థులు భవిష్యత్‌లో పారిశ్రామికవేత్తలుగా, ఇన్నోవేటర్లుగా ఎదగాలని కేయూ వీసీ కె.ప్రతాప్‌రెడ్డి కోరారు. కేయూ, హైదరాబాద్‌లోని టి హబ్‌ సంయుక్తంగా క్యాంపస్‌లోని ఆడిటోరియంలో విద్యార్థులకు ఓరియంటేషన్‌ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన కేయూ వీసీ మాట్లాడుతూ.. విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని ఇన్నోవేషన్‌, ఇంక్యుబేషన్‌, స్టార్టప్స్‌ స్థాపనకు టి హబ్‌, కె హబ్‌ సమగ్ర శిక్షణ అందించనున్నట్లు తెలిపారు. ఎంపిక చేసిన వంద మంది విద్యార్థులకు పూర్తి స్థాయి సహకారం అందించనున్నట్లు వెల్లడించారు. విద్యార్థులతోపాటు అధ్యాపకులు, పరిశోధకులు సైతం నూతన ఆలోచనలు పంచుకోవచ్చన్నారు. కేయూ రిజిస్ట్రార్‌ రామచంద్రం హెదరాబాద్‌ ఏఐసీ టి హబ్‌ ప్రధాన అధికారి రాజేశ్‌కుమార్‌, కేయూ హబ్‌ డైరెక్టర్‌ సవితా జ్యోత్స్న, వివిధ సంస్థల ప్రతినిధులు డాక్టర్‌ వినోద్‌, సయ్యద్‌ రాష్యన్‌, స్వాతి, రిషిత, అరుణ్‌రెడ్డి, టి హబ్‌ ప్రతినిధులు చైతన్య శ్రవణ, మహ్మద్‌హఫీజుద్దీన్‌, ఏర్ల శ్రవణ, సిద్ధార్థ, బొల్లం కిరణ్‌ అధ్యాపకులు, విద్యార్థులు, పరిశోధకులు పాల్గొన్నారు.

న్యూశాయంపేట: తెలంగాణ మైనార్టీ గురుకులాల విద్యాసంస్థలు(టెమ్రిస్‌) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సీఓఈ (సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌) ఇంటర్‌ కళాశాలల్లో ప్రవేశానికి దరఖాస్తు చేసుకునేందుకు ఈనెల 8వ తేదీ వరకు గడువు ఉందని ఉమ్మడి జిల్లా సమన్వయ అధికారి డాక్టర్‌ జంగా సతీశ్‌ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉమ్మడి వరంగల్‌ జిల్లా వ్యాప్తంగా బాలికలకు (హనుమకొండ కేయూ క్రాస్‌ రోడ్డులోని టెమ్రిస్‌ వరంగల్‌–1 బాలికలు), బాలురకు హనుమకొండ హంటర్‌ రోడ్డులోని కాజీపేట బాలుర కళాశాలలో ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అలాగే, జేఈఈ, నీట్‌, ఎంబీబీఎస్‌ ప్రవేశాలకు ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నట్లు వివరించారు. పూర్తి వివరాలకు ఆయా కళాశాలల్లో సంప్రదించాలని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement