ఆయిల్‌పామ్ సాగు లాభదాయకం
ముల్కనూర్ సొసైటీ అధ్యక్షుడు
అల్గిరెడ్డి ప్రవీణ్‌రెడ్డి
ఎల్కతుర్తి: ఆయిల్‌పామ్ సాగు ఎంతో లాభదాయకమని ముల్కనూరు సొసైటీ అధ్యక్షుడు అల్గిరెడ్డి ప్రవీణ్‌రెడ్డి అన్నారు. భీమదేవరపల్లి మండలం ముల్కనూరు కోపరేటివ్ రూరల్ క్రెడిట్ మార్కెటింగ్ సొసైటీ ఆధ్వర్యంలో మంగళవారం రైతులకు నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. ఆయిల్‌పామ్ దేశంలో మంచి డిమాండ్ ఉందన్నారు. అంతకు ముందు జిల్లా వ్యవసాయ అధికారి రవీందర్‌సింగ్ మాట్లాడారు. ఆయిల్‌పామ్ సాగును విస్తరించాలని రైతులకు సూచించారు. వరంగల్, దామెర ప్రాంతాలకు చెందిన ఆయిల్‌పామ్ రైతులు తమ అనుభవాలను పంచుకున్నారు. అనంతరం ఆయిల్‌పామ్ పంటలను పరిశీలించారు. అధికారులు అనసూయ, శ్రీనివాస్, భవానీప్రసాద్, శంకర్, పద్మ పాల్గొన్నారు.
కాళోజీ సెంటర్: కరీమాబాద్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుడు పోగు అశోక్ రాష్ట్రస్థాయి గణిత సదస్సుకు ఎంపికయ్యారు. వరంగల్ డీఈఓ రంగయ్యనాయుడు, ఏఎంఓ సుజన్ తేజ, డీఎస్‌ఓ కట్ల శ్రీనివాస్, ఖిలా వరంగల్ ఎంఈఓ ప్రసాద్, హెచ్‌ఎం అభినందించారు. 19న హైదరాబాద్‌లో జరగనున్న సదస్సుకు రావాలని అశోక్‌కు ఆహ్వానం అందింది.


