అభివృద్ధి చే సేవారికే ఓటు
నిజాయితీ గల అభ్యర్థులను గెలిపిస్తాం
నర్సంపేట: మున్సిపాలిటీ అభివృద్ధిపై అవగాహన ఉన్నవారినే గెలిపించుకుంటామని, నీతి నిజాయితీగా పనిచేసే వారిని ఎన్నుకుని సమస్యలు పరిష్కరించుకుంటామని నర్సంపేట పట్టణ ప్రజలు స్పష్టం చేశారు. కాలనీల్లో రోడ్లు, డ్రెయినేజీలు, వీధి దీపాలు, పారిశుద్ధ్యం వంటి సమస్యలు పరిష్కరించాలని కోరారు. అభివృద్ధి చేసేవారిని గెలిపించుకుంటామని పేర్కొన్నారు. పట్టణంలోని మినీస్టేడియంలో శనివారం ఉదయం జరిగిన ‘సాక్షి’ చర్చా వేదికలో పలువురు ప్రముఖులు ఉత్సాహంగా పాల్గొని తమ అభిప్రాయాలు వెల్లడించారు.
వార్డుల్లో కనీస సౌకర్యాలు కల్పించాలి
రోడ్లు, డ్రెయినేజీలు నిర్మించాలి
‘సాక్షి’ చర్చావేదిక లో నర్సంపేట పట్టణ ప్రజల మనోగతం
అభివృద్ధి చే సేవారికే ఓటు


