బిల్లులు రాకుండా ఆపింది ఎమ్మెల్యేనే | - | Sakshi
Sakshi News home page

బిల్లులు రాకుండా ఆపింది ఎమ్మెల్యేనే

Feb 7 2026 3:13 PM | Updated on Feb 7 2026 3:13 PM

బిల్లులు రాకుండా ఆపింది ఎమ్మెల్యేనే

బిల్లులు రాకుండా ఆపింది ఎమ్మెల్యేనే

బీఆర్‌ఎస్‌ నియోజకవర్గ కో ఆర్డినేటర్‌ రవీందర్‌రావు

నర్సంపేట: మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డిపై ఆరోపణలు సరికాదని, బోర్‌వెల్‌ నిర్వాహకులకు బిల్లులు ఆపింది ప్రస్తుత ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి అని బీఆర్‌ఎస్‌ పార్టీ నియోజకవర్గ కో ఆర్డినేటర్‌ తక్కళ్లపల్లి రవీందర్‌రావు ఆరోపించారు. ఈ మేరకు పట్టణంలో శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ మున్సిపల్‌ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ పార్టీని ఎదుర్కోలేక కాంగ్రెస్‌ పార్టీ కుట్రలు చేస్తోందన్నారు. తాగునీటి సమస్యలను పరిష్కరించడంలో భాగంగానే పెద్ది సుదర్శన్‌రెడ్డి బోర్లు వేయించినట్లు తెలిపారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం చెల్లించాల్సిన బిల్లులను సుదర్శన్‌రెడ్డి చెల్లించాలని అనడం సిగ్గు చేటన్నారు. ప్రశాంత వాతావరణంలో ఉన్న నర్సంపేటను తగాదాలకు నిలయంగా ఎమ్మెల్యే మాధవరెడ్డి తయారు చేస్తున్నారని పేర్కొన్నారు. బోర్‌వెల్‌ నిర్వాహకుల నిరసన వెనుక కాంగ్రెస్‌ పార్టీ ఉందని ఆరోపించారు. సమావేశంలో మార్కెట్‌ మాజీ చైర్మన్‌ బత్తిని శ్రీనివాస్‌గౌడ్‌, నాయకులు, సంగాని సూరయ్య, బాల్నె వెంకన్న, యువరాజు, రాజ్‌కుమార్‌, చంద్రమౌళి, మౌలానా, ఇర్ఫాన్‌, నాయిని వేణుచంద్‌, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement