47 ఏళ్ల జ్ఞాపకాలు పదిలం | - | Sakshi
Sakshi News home page

47 ఏళ్ల జ్ఞాపకాలు పదిలం

Feb 19 2026 10:07 AM | Updated on Feb 19 2026 10:07 AM

47 ఏళ్ల జ్ఞాపకాలు పదిలం

47 ఏళ్ల జ్ఞాపకాలు పదిలం

నాచినపల్లి పాఠశాలలో పూర్వవిద్యార్థుల సమ్మేళనం

దుగ్గొండి: వారంతా వృద్ధులు.. 47 ఏళ్ల క్రితం పాఠశాల విద్య అనంతరం విడిపోయారు. ఎక్కడెక్కడో స్థిరపడ్డారు. మళ్లీ ఒక్కచోట కలుసుకున్నారు. మండలంలోని నాచినపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 1977–78 విద్యాసంవత్సరంలో పదో తరగతి పూర్తి చేసిన వారంతా ప్రముఖ ఆర్థోపెడిక్‌ కాళీప్రసాద్‌ ఆధ్వర్యంలో బుధవారం కలుసుకున్నారు. పాఠశాలలో చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. సుదీర్ఘకాలం అనంతరం కలుసుకోవడంతో మళ్లీ ఒకరినొకరు పరిచయం చేసుకున్నారు. కష్టసుఖాలు పంచుకున్నారు. కాసేపు పిల్లలుగా మారి అల్లరి చేశారు. ప్రతి సంవత్సరం కలుసుకోవాలని తీర్మానించుకున్నారు. కార్యక్రమంలో పూర్వవిద్యార్థులు డాక్టర్‌ సీహెచ్‌.రవీందర్‌, జంగా జనార్దన్‌రెడ్డి, అంచూరి సదానందం, అండృ సాంబరెడ్డి, ఉప్పుల అనిల్‌రెడ్డి, మహ్మద్‌యాకూబ్‌, పద్మజ, విజయజ్యోతి, అరుణకుమారి, వేణుగోపాల్‌, నర్సింహా చారి, ఐలయ్య, బ్రహ్మానందం, రమేశ్‌బాబు, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement