మినీస్టేడియాన్ని అభివృద్ధి చేయాలి.. | - | Sakshi
Sakshi News home page

మినీస్టేడియాన్ని అభివృద్ధి చేయాలి..

Feb 8 2026 7:13 AM | Updated on Feb 8 2026 7:13 AM

మినీస

మినీస్టేడియాన్ని అభివృద్ధి చేయాలి..

నర్సంపేట పట్టణంలోని మినీస్టేడియానికి ప్రతిరోజు 400 నుంచి 500 మంది వాకింగ్‌ కోసం వస్తుంటారు. మినీస్టేడియంలో ఎలాంటి సదుపాయాలు లేవు. ఓపెన్‌ జిమ్ములో పరికరాలు నిరుపయోగంగా మారాయి. అధికారులు, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోకపోవడం లేదు. వాకర్స్‌ అందరం కలిసి చందాలు వేసుకొని జిమ్ము పరికరాలకు మరమ్మతులు చేసుకున్నాం. నూతన పాలకవర్గం మినీస్టేడియాన్ని అభివృద్ధి చేయాలి.

– వెంగళ భిక్షపతి, వ్యాపారి, నర్సంపేట

విద్యావంతులను గెలిపించాలి..

త్వరలో జరగనున్న మున్సిపాలిటీ ఎన్నికల్లో రాజకీయ అనుభవంతోపాటు మేధావులు, విద్యావంతులను ఎన్నుకోవాలి. వార్డుల్లో ఉన్న సమస్యలపై మున్సిపాలిటీలో గళం విప్పి పరిష్కరించేలా చూస్తారు. సమస్యలపై పూర్తిస్థాయిలో అవగాహన పెంచుకొని నిస్వార్థంగా పనిచేస్తారు.

– దేశపాక అశోక్‌, వాకర్స్‌ అసోసియేషన్‌ ఈసీ మెంబర్‌, నర్సంపేట

ప్రజలకు అందుబాటులో ఉండాలి..

వార్డుల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి, వాటిని పరిష్కరించేందుకు కృషిచేయాలి. అంతేకాకుడా ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండేవారిని ఎన్నుకోవాలి. నర్సంపేటను అభివృద్ధి పథంలో నడిపించుకోవాలి. – గంధం మనోహర్‌

మినీస్టేడియాన్ని అభివృద్ధి చేయాలి..1
1/2

మినీస్టేడియాన్ని అభివృద్ధి చేయాలి..

మినీస్టేడియాన్ని అభివృద్ధి చేయాలి..2
2/2

మినీస్టేడియాన్ని అభివృద్ధి చేయాలి..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement