ఓట్ల లెక్కింపు పకడ్బందీగా నిర్వహించాలి | - | Sakshi
Sakshi News home page

ఓట్ల లెక్కింపు పకడ్బందీగా నిర్వహించాలి

Feb 13 2026 3:17 AM | Updated on Feb 13 2026 3:17 AM

ఓట్ల లెక్కింపు పకడ్బందీగా నిర్వహించాలి

ఓట్ల లెక్కింపు పకడ్బందీగా నిర్వహించాలి

కలెక్టర్‌ సత్యశారద

నర్సంపేట/వర్ధన్నపేట: మున్సిపల్‌ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియను పకడ్బందీగా పూర్తి చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ సత్యశారద అధికా రులను ఆదేశించారు. నర్సంపేట వ్యవసాయ మా ర్కెట్‌లో, వర్ధన్నపేట ఏర్పాటు చేసిన మున్సిపల్‌ ఎన్నికల కౌంటింగ్‌ కేంద్రాలను గురువారం ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా మున్సిపల్‌లో వా ర్డుల వారీగా ఏర్పాటు చేసిన కౌంటింగ్‌ టేబుల్స్‌, అభ్యర్థుల గ్యాలరీలను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. కౌంటింగ్‌ సిబ్బంది, అభ్యర్థులకు, మీడియా సౌకర్యాలు పరిశీలించారు. అనుమతి ఉన్న వ్యక్తులను మాత్రమే కౌంటింగ్‌ కేంద్రాల్లోకి అనుమతించాలని ఆదేశించారు. ఎలాంటి అ వాంఛనీయ సంఘటనలు జరుగకుండా పటిష్ట పో లీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని సూచించా రు. వాహనాల పార్కింగ్‌ విషయంలో ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ సత్యశారద మాట్లాడుతూ.. కౌంటింగ్‌ శుక్రవారం ఉదయం 8 గంటలకు ప్రారంభమవుతుందని, మొత్తం 6 రౌండ్లలో, 10 టేబుళ్ల ద్వారా కౌంటింగ్‌ ప్రక్రియ నిర్వహించనున్నట్లు తెలి పారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ సంధ్యారా ణి, ఆర్డీఓ ఉమారాణి, మున్సిపల్‌ కమిషనర్‌ భాస్కర్‌, తహసీల్దార్‌ రవిచంద్రారెడ్డి, సీఐ సాయన్న, డీ ఆర్‌డీఓ రామిరెడ్డి, ఆర్డీఓ సుమ, తహసీల్దార్‌ విజ యసాగర్‌, మున్సిపల్‌ కమిషనర్‌ సుఽధీర్‌కుమార్‌, సీఐ శ్రీనివాసరావు, అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement