గెలిచేదెవరు..? | - | Sakshi
Sakshi News home page

గెలిచేదెవరు..?

Feb 13 2026 3:17 AM | Updated on Feb 13 2026 3:17 AM

గెలిచ

గెలిచేదెవరు..?

– IIలోu

నేడు మున్సిపల్‌ ఓట్ల లెక్కింపు

నర్సంపేట, వర్ధన్నపేటలో పాగాపై

కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ ధీమా

గెలుపోటములపై అభ్యర్థుల్లో టెన్షన్‌

ఉదయం 8గంటల నుంచి

ఓట్ల లెక్కింపు షురూ

సాక్షి, వరంగల్‌: మున్సిపల్‌ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ నేడు జరగనుండడంతో ఆయా పార్టీలతోపాటు స్వతంత్య్ర అభ్యర్థుల్లో టెన్షన్‌ నెలకొంది. నామినేషన్‌ నుంచి ఎన్నికలు ముగిసే వరకు గెలుపుకోసం కష్టపడ్డ అభ్యర్థులతోపాటు, ఆయా పార్టీ నాయకులు, కార్యకర్తలు సైతం ఫలితాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ పార్టీ మేమంటే మేము గెలుస్తున్నామనే ధీమాలో ఉన్నా.. ఓటరు నాడీ ఎటువైపు ఉందో నేడు తేలనుంది. ఈ మేరకు నర్సంపేటలోని వ్యవసాయ మార్కెట్‌, వర్ధన్నపేట మున్సిపల్‌ కార్యాలయంలోని స్ట్రాంగ్‌ రూమ్‌లో భద్రపరిచిన బ్యాలెట్‌ బాక్కుల్లోని ఓట్లను లెక్కిస్తేగానీ ఉత్కంఠకు తెరపడదు. ఈ లెక్కింపు ప్రక్రియ ఉదయం ఎనిమిది గంటలకు నుంచి ప్రారంభం కానుంది. కాగా, నర్సంపేటలోని 30 వార్డుల్లో 120 మంది, వర్ధన్నపేటలోని 12 వార్డుల్లో 50 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు.

చైర్మన్‌ అభ్యర్థుల్లో టెన్షన్‌

బీసీ మహిళకు రిజర్వ్‌ అయిన నర్సంపేట ము న్సిపల్‌ చైర్‌పర్సన్‌ పదవికి కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా ఇప్పటికే ప్రకటించిన పెండెం శ్రీలక్ష్మి, బీఆర్‌ఎస్‌ నుంచి ఆశావహులుగా ఉన్న నాగెల్లి పద్మ, నాగిశెట్టి పద్మలకు కౌన్సిలర్‌గా గెలవడం తప్పనిసరిగా మా రింది. వర్ధన్నపేట మున్సిపల్‌ చైర్మన్‌ జనరల్‌ రిజ ర్వ్‌ కావడంతో కాంగ్రెస్‌ పార్టీ నుంచి ఈగ దామోదర్‌, పాలకుర్తి సారంగపాణి, బీఆర్‌ఎస్‌ నుంచి సిలు వేరు కుమారస్వామి, తుమ్మల యాకయ్య, గుజ్జ వీ రన్నలకు గెలుపు ప్రతిష్టాత్మకంగా మారింది. పార్టీ అభ్యర్థులు అధిక సంఖ్యలో గెలిచి తాము విజ యం సాధిస్తేనే వీరికి మార్గం సుగమం కానుంది. ఓవైపు తమ గెలుపు, ఇంకోవైపు పార్టీ గెలుపు ఈ చైర్మన్‌ అభ్యర్థులకు ముచ్చెమటలు పట్టిస్తోంది. అయితే గెలిచిన అభ్యర్థులను కాపాడుకోవడం కోసం చైర్మన్‌ ఎన్నికయ్యేంత వరకు క్యాంపులు నిర్వహించేందుకు ఆయా పార్టీలు ఏర్పాట్లు చేసుకుంటున్నాయి.

చేజిక్కుతుందా.. మళ్లీ గుబాళిస్తుందా..

2020 జనవరి 22న జరిగిన మున్సిపల్‌ ఎన్నికల్లో నర్సంపేటలో 24 వార్డులు, వర్ధన్నపేటలో 12 వార్డులుంటే 24 టీఆర్‌ఎస్‌ గెలవగా, ఎనిమిది కాంగ్రెస్‌, ఒకటి బీజేపీ, ఇతరులు ముగ్గురు గెలిచారు. అయితే ఈసారి నర్సంపేటలో శివారు గ్రామాల విలీనంతో ఆరు వార్డులు పెరిగి 30 వార్డులకు, వర్ధన్నపేట యధావిధిగా 12 వార్డుల కు జరిగాయి. ఈ ఎన్నికల్లో గతంలోలాగా నే మెజార్టీ సీట్లు సాధించి అధికారాన్ని బీఆర్‌ఎస్‌ దక్కించుకుంటుందా, లేదా కాంగ్రెస్‌ గతంలోకన్నా మెరుగైనా సీట్లు సాధించి చైర్మన్‌ పీఠం చేజిక్కించుకుంటుందా.. అన్నది నేడు తేలనుంది. గతంలో ఒక స్థానం స్థానం గెలిచిన బీజేపీ ఈసారి మెరుగైన స్థానాలు గెలుచుకుంటామనే ధీమాతో ఉంది.

చేతులెత్తే పద్ధతిలో..

ఫిబ్రవరి 16 తేదీ ఉదయం 11 గంటలకు కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారం ఉండనుంది. సమావేశం ప్రారంభమైన గంటలోపు మొత్తం సంఖ్యలో సగం మంది సభ్యులు హాజరు కావాలి. ఉదాహరణకు నర్సంపేటలో 30 మంది వార్డు సభ్యులు, ఒక ఎక్స్‌ అఫీషియో సభ్యుడు ఉంటే మొత్తం 31 అవుతారు.. ఎన్నికకు 16 మంది హాజరుకావాల్సి ఉంటుంది. పార్టీలు జారీ చేసిన విప్‌లను అధికారులు ఎన్నికలు జరిగే హాల్‌లో చదివి వినిపిస్తారు. చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ ఎన్నికలు బహిరంగంగా వార్డు సభ్యులు చేతులెత్తడం ద్వారా నిర్వహించనున్నారు. ఫిబ్రవరి 16న ఎన్నికకు సరిపడా కోరం లేకపోయినా.. లేదా ఎన్నికలు విఫలమైనా.. తిరిగి 17న ఎన్నికలు నిర్వహిస్తారు. ఆ రోజు కూడా ఎన్నిక జరగని పక్షంలో రాష్ట్ర ఎన్నికల సంఘానికి నివేదిస్తే మరో తేదీని ఖరారు చేస్తుంది.

ఈ నెల 16న జరిగేచైర్మన్‌, వైస్‌ చైర్మన్ల ఓటింగ్‌లో ఎక్స్‌అఫీషియో ఓట్లు కీలకంగా మారనున్నాయి. ఎక్స్‌ అఫీషియో సభ్యులుగా, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీల నమోదుకు అవకాశం ఉండడం వర్ధన్నపేట, నర్సంపేట మున్సిపాలిటీల్లో కాంగ్రెస్‌ పార్టీకి కలిసిరానుంది. చైర్మన్‌ పీఠాన్ని దక్కించుకోవడానికి కావల్సిన మెజార్టీకి కాస్తా దూరంలో ఉంటే ఇతర పార్టీల నుంచి సభ్యులను తమ వైపునకు తిప్పుకునే బదులు ఎక్స్‌ అఫీషియో ఓట్లతో చేజిక్కించుకునే అవకాశముంది. వర్ధన్నపేటలో ఎమ్మెల్యే కేఆర్‌ నాగరాజు, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, వరంగల్‌ ఎంపీ కడియం కావ్య, నర్సంపేటలో ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి, ఎమ్మెల్సీ శ్రీపాల్‌రెడ్డి, మహబూబాబాద్‌ ఎంపీ పొరిక బలరాంనాయక్‌కు అవకాశముంది. బీఆర్‌ఎస్‌ నుంచి ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌ రెడ్డి ఉన్నారు. ఈ నెల 14 వరకు ఎక్స్‌ ఆఫీషియో సభ్యుల నమోదుకు అవకాశం ఉండడంతో వేచి చూసే ధోరణిలో ఉన్నారు.

ఉదయం 8గంటలకు లెక్కింపు షురూ

‘పుర’ ఓట్ల లెక్కింపు ఇలా..

వర్ధన్నపేట మున్సిపాలిటీ కార్యాలయంలో శుక్రవారం ఉదయం ఎనిమిది గంటలకు కౌంటింగ్‌ మొదలవుతుంది. మొత్తం 4 టేబుళ్లు, 3 రౌండ్లు, నలుగురు రిటర్నింగ్‌ అధికారులు, నలుగురు అసిస్టెంట్‌ రిటర్నింగ్‌ అధికారులు, 100 మంది సిబ్బంది పాల్గొననున్నారు. తొలుత బ్యాలెట్‌ బాక్స్‌ల్లోని ఓట్లు, ఆ తర్వాత పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లు లెక్కించనున్నారు. ఇక్కడ తొలి ఫలితం 10.30కు వెలువడే అవకాశముంది. మధ్యాహ్నం ఒంటి గంటలోపు పూర్తి ఫలితాలొస్తాయి.

నర్సంపేట వ్యవసాయ మార్కెట్‌ యార్డ్‌లో ఆరు రౌండ్లు, పది టేబుళ్లు, పది మంది రిటర్నింగ్‌ అధికారులు, పది మంది అసిస్టెంట్‌ రిటర్నింగ్‌ అధికారులు, పది మంది కౌంటింగ్‌ సూపర్‌ వైజర్లు, 30 మంది అసిస్టెంట్‌ కౌంటింగ్‌ సూపర్‌ వైజర్లు, ఇతర సిబ్బంది ఉండనున్నారు. ఇక్కడ కూడా ఫలితం 10.30 నుంచి 11.00 గంటల మధ్య తేలనుంది. మొత్తం ఫలితాలు మధ్యాహ్నం మూడు నుంచి సాయంత్రం నాలుగు గంటల మధ్య వెల్లడవుతాయి.

గెలిచేదెవరు..?1
1/1

గెలిచేదెవరు..?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement