ప్రజాసమస్యలు పరిష్కరించాలి.. | - | Sakshi
Sakshi News home page

ప్రజాసమస్యలు పరిష్కరించాలి..

Feb 8 2026 7:13 AM | Updated on Feb 8 2026 7:13 AM

ప్రజా

ప్రజాసమస్యలు పరిష్కరించాలి..

నర్సంపేట పట్టణంలో త్వరలో జరగనున్న మున్సిపాలిటీ ఎన్నికల్లో నిస్వార్థంగా, నిజాయితీగా పనిచేసే వారికే పట్టం కట్టాలి. ప్రజల సమస్యలను పరిష్కరించేవారిని గెలిపించుకోవాలి. నర్సంపేట మున్సిపాలిటీని అభివృద్ధి చేసుకోవాలి.

– డాక్టర్‌ పుల్లూరి శ్రీనివాస్‌గౌడ్‌, గవర్నర్‌,

వాకర్స్‌ ఇంటర్నేషనల్‌ క్లబ్‌

వాకింగ్‌ ట్రాక్‌ నిర్మించాలి..

నర్సంపేట పట్టణంలోని పలు వార్డుల నుంచి యువకులు, మేధావులు, రిటైర్డ్‌ ఎంప్లాయీస్‌, మహిళలు తదితరులు మినీ స్టేడియానికి ప్రతిరోజూ వాకింగ్‌కు వస్తున్నారు. ఈ స్టేడియంలో వాక్సర్స్‌ కోసం వాకింగ్‌ట్రాక్‌ లేదు. చెట్లు, కంకర ఉండడంతో వాకింగ్‌ చేయాలంటే తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. ప్రత్యేకంగా వాకర్స్‌ కోసం ట్రాక్‌ సౌకర్యం కల్పించాలి. – రాపాక చంద్రమౌళి, తెలంగాణ కాలనీ

సమస్యలపై గళం విప్పాలి..

నర్సంపేట మున్సిపాలిటీ ఎన్నికల్లో ప్రజల సంక్షేమం కోసం అనునిత్యం కృషిచేసే వారిని, వార్డుల్లో సమస్యలను పరిష్కరించేందుకు నిత్యం అందుబాటులో ఉండేవారిని ఎన్నుకోవాలి. నిస్వార్థంగా పనిచేసే వారిని ఎన్నికల్లో గెలిపించుకోవాలి. ప్రజాసమస్యలపై మున్సిపాలిటీలో గొంతువిప్పి, వాటిని పరిష్కరించేందుకు కృషిచేయాలి. గెలిచిన అభ్యర్థులు ప్రజలకు ఉపయోగపడే అభివృద్ధి పనులు చేయాలి.

– కృష్ణమూర్తి, ప్రైవేట్‌ టీచర్‌, నర్సంపేట

ప్రజాసమస్యలు పరిష్కరించాలి..1
1/2

ప్రజాసమస్యలు పరిష్కరించాలి..

ప్రజాసమస్యలు పరిష్కరించాలి..2
2/2

ప్రజాసమస్యలు పరిష్కరించాలి..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement