స్వార్థ రాజకీయాలతో అన్యాయం
వాస్తవానికి నాటి పరకాల రాజకీయాలకు.. నేటి రాజకీయాలకు కొంత భిన్నమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. అందుకు తోడు ప్రజలు ప్రలోభాలకు గురికావడంతో పరకాలకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించలేని తనం ప్రజల్లో పెరుగుతోంది. ప్రజలు నాటి పరకాల చరిత్రను స్ఫూర్తిగా తీసుకుని నేటి మున్సిపల్ ఎన్నికల్లో మంచి తీర్పు ఇవ్వాలి.
– రేపాల నర్సింహారాములు, సీనియర్ జర్నలిస్ట్, రచయిత
ఉపాధి కల్పించాలి..
పరకాల పట్టణంలో ఉపాధి అవకాశాలు లేక చాలా మంది నిరుద్యోగులు రోడ్లపై తిరగాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ఎన్నికలు రాగానే, ఓటు వేయమని అడిగే నాయకులే కానీ, పట్టణ, వార్డుల సమస్యలపై ఎజెండా లేకపోవడం బాధగా ఉంది.
– నూతన్, నిరుద్యోగి, పరకాల
స్వార్థ రాజకీయాలతో అన్యాయం


