హామీలకు కట్టుబడి ఉండాలి..
ప్రజాస్వామ్య దేశంలో ఓటు హక్కు విలువ చాలా గొప్పది. అలాంటి ఓటుపైనే దేశ భవిష్యత్.. ప్రజల భవిష్యత్ ఆధారపడి ఉంది. ప్రజలే దేవుళ్లు అని భావించే నాయకులు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు విస్మరించడంతో ప్రజల్లో విశ్వసనీయత కోల్పోతున్నారు. హామీలకు కట్టుబడి ఉండాలి.
– గండ్ర నరేశ్‌రెడ్డి, సీనియర్ అడ్వకేట్
పిలిస్తే పలికే పాలకులు కావాలి
అధికారంలో ఉన్నా.. లేకపోయినా ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడే నాయకుడు కావాలని ప్రజలు కోరుకోవాలి. ఓడిపోగానే ప్రజలతో సంబంధం లేదన్న నాయకుల కంటే అధికారంలో ఉన్న లేకపోయినా ప్రజలకు అండగా నిలిచే నాయకులను గెలిపించుకోవాల్సిన బాధ్యత ప్రజలపై ఉంది.
– చంద్రశేఖర్, శ్రీ సరస్వతి శిశుమందిర్ ప్రధానాచార్యుడు
హామీలకు కట్టుబడి ఉండాలి..


