ముల్కనూరులో శిక్షణ అధికారుల సందడి | - | Sakshi
Sakshi News home page

ముల్కనూరులో శిక్షణ అధికారుల సందడి

Feb 7 2026 3:13 PM | Updated on Feb 7 2026 3:13 PM

ముల్క

ముల్కనూరులో శిక్షణ అధికారుల సందడి

ముల్కనూరులో శిక్షణ అధికారుల సందడి 11న పరకాల మున్సిపాలిటీ పరిధిలో సెలవు

ఎల్కతుర్తి: భీమదేవరపల్లి మండలం ముల్కనూరు సహకార సంఘాన్ని తెలంగాణ రాష్ట్ర సహకార శాఖకు చెందిన 52మంది నూతనంగా నియమితులైన అసిస్టెంట్‌ రిజిస్ట్రార్లు శుక్రవారం సందర్శించారు. ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కో–ఆపరేటివ్‌ మేనేజ్‌మెంట్‌ (ఐసీఎం) 36 వారాల హయ్యర్‌ డిప్లొమా ఇన్‌ కో–ఆపరేటివ్‌ మేనేజ్‌మెంట్‌ శిక్షణ పొందుతున్న అసిస్టెంట్‌ రిజిస్ట్రార్లు సహకార రంగంలో ఉత్తమంగా పనిచేస్తున్న సంస్థల పని తీరును ప్రత్యక్షంగా పరిశీలించారు. ముల్కనూరు సహకార సంఘం అందిస్తున్న వివిధ సేవలు, నిర్వహణ విధానం తదితర అంశాలు తెలుసుకున్నారు. సంఘం అధ్యక్షుడు అల్గిరెడ్డి ప్రవీణ్‌రెడ్డి నూతనంగా నియమితులైన ప్రభుత్వ అధికారులతో చర్చించారు. సంఘం ఎదుర్కొంటున్న సవాళ్లు, భవిష్యత్‌ కార్యాచరణ ప్రణాళికపై వివరించారు. నూతన అధికారులు అభినందిస్తూ, ఈ శిక్షణ కార్యక్రమం అధికారుల భవిష్యత్‌ సహకార సేవలకు ఎంతో ఉపయోగకరంగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

హన్మకొండ అర్బన్‌: పరకాల మున్సిపాలిటీ ఎన్నికల సందర్భంగా ఈ నెల 11న బుధవారం స్థానిక సెలవుగా దినంగా ప్రకటించినట్లు ఎన్నికల అధికారి, కలెక్టర్‌ స్నేహ శబరీష్‌ తెలిపారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ మార్గదర్శకాల మేరకు పోలింగ్‌ రోజున ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థల ఉద్యోగులతో పాటు ఎన్నికల పరిధి దుకాణాలు, ప్రైవేట్‌ సంస్థల్లో పనిచేసే కార్మికులకు వేతనంతో కూడిన సెలవు దినంగా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అదే విధంగా ఎన్నికల నిర్వహణకు ఉపయోగించే ప్రభుత్వ, విద్యా సంస్థల భవనాలకు ఈనెల 10న, 11 పోలింగ్‌ రోజున, 13న ఓట్ల లెక్కింపు రోజుల్లో సెలవు దినాలుగా పరిగణించాలని సూచించారు. ఓటర్లు విధిగా పోలింగ్‌ కేంద్రాలకు వచ్చి ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు.

ముల్కనూరులో శిక్షణ  అధికారుల సందడి1
1/1

ముల్కనూరులో శిక్షణ అధికారుల సందడి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement