పెళ్లి పండుగ మొదలు.. | - | Sakshi
Sakshi News home page

పెళ్లి పండుగ మొదలు..

Feb 19 2026 10:07 AM | Updated on Feb 19 2026 10:07 AM

పెళ్ల

పెళ్లి పండుగ మొదలు..

జనగామ: ఉమ్మడి జిల్లావ్యాప్తంగా పెళ్లికళ సంతరించుకుంది. సుదీర్ఘ విరామం తర్వాత నేటి (గురువారం) నుంచి శుభ ముహూర్తాలు ప్రారంభమవుతుండడంతో కుటుంబాలు పండుగ జోరులో ఉన్నాయి. ఇప్పటికే ఎంగేజ్‌మెంట్‌ చేసుకొని పెళ్లి కార్యాలకోసం ఎదురుచూస్తున్న కుటుంబాలు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకుంటున్నాయి.

జోరుగా వ్యాపారం..

పెళ్లిళ్ల సీజన్‌ మొదలవడంతో బంగారు, వెండివ్యాపార సంస్థలు, పూల దుకాణాలు, బ్యాండ్‌ బాజా, సన్నాయి మేళా బృందాలు, మేకప్‌ ఆర్టిస్టులు, పెళ్లిలతో సంబంధం ఉన్న చిన్నచిన్న వ్యాపారాల వరకు గిరాకీ బాగా పెరిగింది. ఫంక్షన్‌ హాల్స్‌, కన్వెన్షన్‌ సెంటర్లు ముందుగానే బుక్‌ అయిపోవడంతో చివరి నిమిషంలో ముహూర్తాలు పెట్టుకున్న వారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరికొందరు పట్టణ పరిధిలో హాళ్లు దొరకకపోవడంతో దూర ప్రాంతాల్లోని ఫంక్షన్‌ హాళ్లను ఆశ్రయిస్తున్నారు.

బడ్జెట్‌ ఖర్చుపై ఆలోచనలు..

పెళ్లిళ్లకు బడ్జెట్‌ మాత్రం కుటుంబాలను బాగా ఆలోచింపజేస్తోంది. బంగారం, వెండి ధరలు అంచనాలకు మించి పెరగడంతో సాధారణ, పేద, మధ్యతరగతి వారికి గత ఏడాది వేసుకున్న అంచనాలు పెరిగి పోయాయి. దీంతో ఆభరణాల కొనుగోళ్లు సగానికి తగ్గించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

నేటినుంచి శుభ ఘడియలు

రెండు నెలల్లో ముహూర్తాలు కొన్నే..

లిమిటెడ్‌ ముహూర్తాలు

ఫిబ్రవరిలో 19, 20, 21, 22, 25, 26, మార్చిలో 5, 6, 7, 8, 11, 12 తేదీల్లో శుభ ముహూర్తాలు ఉన్నాయి. అంటే.. రెండు నెలలు కలిపి మొత్తం 12 ముహూర్తాలే ఉన్నాయి. మార్చి 19న ఉగాది సందర్భంగా కొత్త పంచాంగం విడుదలైన తర్వాత ఏప్రిల్‌ నెలలో వచ్చే శుభ ముహూర్తాలు తేదీలను ప్రకటిస్తారు.

– శ్రీనివాసశర్మ, శ్రీసంతోషిమాత ఆలయ

ప్రధాన అర్చకుడు, జనగామ

పెళ్లి పండుగ మొదలు..1
1/1

పెళ్లి పండుగ మొదలు..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement