అభివృద్ధికి పట్టం కట్టాలి
పరకాల: నిజాం పాలనకు వ్యతిరేకంగా ఉద్యమించి ఎంతో మంది అమరులైన పోరాటాల గడ్డ పరకాల. 1960లో ఉమ్మడి జిల్లాలోనే మొదటి మున్సి పాలిటీ. కొందరు రాజకీయ స్వార్థ ప్రయోజనాల కారణంగా అన్యాయానికి గురైంది. 1965లో మేజర్ గ్రామ పంచాయతీగా.. ప్రత్యేక రాష్ట్రంలో మళ్లీ 2018లో మున్సిపాలిటీగా అప్‌గ్రేడ్ అయ్యింది. కానీ ఇప్పటికీ అభివృద్ధిలో వివక్షకు గురవుతూనే ఉంది. ఈప్రాంత అభివృద్ధి కో సం పనిచేసే నాయకత్వం అవసరం.’ అని విద్యావేత్తలు, ప్రముఖులు మేధావులు, నిరుద్యోగులు, వ్యాపారులు అన్నారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ‘సాక్షి’ మీడియా ఆధ్వర్యంలో ‘ప్రజాతీర్పు.. సమస్యలు–పరిష్కారం’ అంశంపై శనివారం పరకాలలోని ఎస్వీ డిగ్రీ కళాశాలలో చర్చావేదిక నిర్వహించింది. ఇందులో అనేక సమస్యలపై చర్చ జరిగింది. స్వార్థపూరిత రాజకీయాలు వీడి.. పరకాల పట్టణాభివృద్ధికి పట్టం కట్టే నాయకత్వంతో పాటు పాలకులు ఎన్నుకోవాల్సిన బాధ్యత పట్టణ ఓటర్లపై ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. పరకాలలో పేరుకుపోయిన పారి శుద్ధ్య సమస్యతో పాటు కోట్ల రుపాయల నిధులతో చేపట్టిన అభివృద్ధి పనులు పూర్తి చేయడం కోసం శ్రమించే పాలకులను.. కొత్త జిల్లాల ఏర్పాటులో పరకాలకు అన్యాయాన్ని ఇప్పటికై నా పాలకులను నిలదీసేంత సత్తాగల నాయకులే రేపటి పరకాల భవిష్యత్ వారసులని అభిప్రాయపడ్డారు. నా డు వ్యాపార వాణిజ్య రంగంలో వరంగల్ తర్వాత రెండో స్థానంలో ఉన్న పరకాలలో నేడు ప్రధాన రహదారుల గుండా అనేక దుకా ణాల షట్టర్లకు టు లెట్ బోర్డులు ఎందుకు దర్శనమిస్తున్నాయో ప్రశ్నించుకోవాలన్నారు. ఓట్ల కోసం వచ్చే వారిని ఎలాంటి డబ్బు.. మద్యం వంటి ప్రలోభాలకు గురవకుండా.. ప్రశ్నించాల్సిన బాధ్య త ప్రతీ ఓటరుపై ఉందని చర్చా వేదికలో పాల్గొన్న ప్రముఖులు అభిప్రాయాలు వ్యక్తం చేశారు.
●
స్వార్థపూరిత రాజకీయాలతో పరకాలకు అన్యాయం
డబ్బు, ప్రలోభాలకు లొంగకుండా
అభివృద్ధిని కోరుకుందాం
‘సాక్షి’ చర్చావేదికలో ప్రముఖులు,
పట్టణ ప్రజలు


