వేయిస్తంభాల ఆలయాన్ని యునెస్కోలో చేర్చాలి | - | Sakshi
Sakshi News home page

వేయిస్తంభాల ఆలయాన్ని యునెస్కోలో చేర్చాలి

Feb 13 2026 3:17 AM | Updated on Feb 13 2026 3:17 AM

వేయిస్తంభాల ఆలయాన్ని యునెస్కోలో చేర్చాలి

వేయిస్తంభాల ఆలయాన్ని యునెస్కోలో చేర్చాలి

‘కుడా’ చైర్మన్‌ ఇనగాల వెంకట్రాంరెడ్డి

హన్మకొండ కల్చరల్‌: వేయిస్తంభాల ఆలయాన్ని యునెస్కోలో చేర్చాలని, ‘కుడా’ నిధులతో దేవాల య పరిసర ప్రాంతాలను అభివృద్ధి చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేశామని ‘కుడా’ చైర్మన్‌ ఇనగాల వెంకట్రామ్‌రెడ్డి అన్నారు. వేయిస్తంభాల ఆలయ ఈఓ అనిల్‌కుమార్‌, ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ గురువారం రాత్రి ‘కుడా’ చైర్మన్‌ను కలిసి దేవాలయ అభివృద్ధి పనులపై, శివరాత్రి ఉత్సవాల నిర్వహణ ఏర్పాట్లపై చర్చించి ఉత్సవాలకు రావాల్సిందిగా ఆహ్వానించారు. ఈసందర్భంగా వెంకట్రామ్‌రెడ్డి మాట్లాడుతూ.. గుడి చు ట్టూ ఉన్న షాపులను, గృహాలను పరిహారం కట్టించి తొలగిస్తామని, కొంతమంది గృహ యజమానులు ముందుకు వచ్చినట్లు పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement