గ్రీన్‌ఫీల్డ్ హైవే రైతులతో ఆర్బిట్రేషన్
న్యూశాయంపేట: గ్రీన్‌ఫీల్డ్ నేషనల్ హైవేలో భూములు కోల్పోయిన జిల్లాలోని సంగెం మండలానికి చెందిన రైతులతో కలెక్టర్ సత్యశారద తన ఛాంబర్‌లో గురువారం ఆర్బిట్రేషన్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భూములు కోల్పోయిన 8 మంది రైతుల ఆర్బిట్రేషన్ పూర్తయిందని తెలిపారు. కార్యక్రమంలో వరంగల్ ఆర్డీఓ సుమ, తహసీల్దార్ రాజ్‌కుమార్, పర్యవేక్షకులు విశ్వప్రసాద్, సంబంధిత రైతులు పాల్గొన్నారు.
కౌంటింగ్ కేంద్రాల వద్ద నిషేధాజ్ఞలు
వరంగల్ క్రైం: కమిషనరేట్ పరిధి జనగామ, స్టేషన్ ఘన్‌పూర్, వర్ధన్నపేట, పరకాల, నర్సంపేట మున్సిపాలిటీలకు సంబంధించిన కౌంటింగ్ కేంద్రాల వద్ద శుక్రవారం నుంచి నిషేధాజ్ఞలు అమలులో ఉంటాయని సీపీ సన్‌ప్రీత్ సింగ్ తెలి పారు. శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా.. 200 మీటర్ల పరిధిలో బీఎన్‌ఎస్‌ఎస్, సీఆర్‌పీసీ–163 ప్రకారం.. ప్రజలు ఐదుగురు అంతకంటే ఎక్కువ మంది గుంపులుగా చేరడం నిషేధమని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ తెలిపారు. ఈ నిషేధం నేడు (శుక్రవారం) ఉద యం 6 గంటల నుంచి శనివారం ఉదయం 6 గంటల వరకు అమలులో ఉంటాయని పేర్కొన్నారు. ఎవరైనా ఉత్తర్వులు అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని సీపీ హెచ్చరించారు.
కొమ్మాల జాతర
వేలం ఖరారు
గీసుకొండ: మండలంలోని కొమ్మాల లక్ష్మీనర్సింహస్వామి జాతర వేలం గురువారం ఖరారు చే సినట్లు ఈఓ ప్రసాద్ తెలిపారు. గత జాతరతో పోలిస్తే రూ.1,90,500 అధిక ఆదాయం సమకూరిందని తెలిపారు. కొబ్బరికాయలు విక్రయానికి రూ.6,07,000, కొబ్బరి చిప్పలు పోగు చేసుకోవడానికి రూ.2.82 లక్షలు, తలనీలాలు పోగు చేసుకోవడానికి రూ.31వేలు, పుట్నాలు, పేలాలు విక్రయించడానికి రూ.23,500గా వేల ఖరారైనటుల తెలిపారు. కార్యక్రమంలో దేవా దాయశాఖ స్పెషల్ ఆఫీసర్ వై.రత్నాకర్‌రెడ్డి, ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త చక్రవర్తుల శ్రీనివా సాచార్యులు, అర్చకులు కాండూరి రామాచార్యులు, విష్ణు, ఫణీంద్ర, సిబ్బంది ప్రేమ్‌కుమార్, వీరస్వామి, అనురాధ పాల్గొన్నారు.
రేపు సీఓఈలో ప్రవేశానికి పరీక్ష
న్యూశాయంపేట: తెలంగాణ మైనారిటీ గురుకులాల విద్యాసంస్థలు(టెమ్రిస్) ఆధ్వర్యంలో ఏ ర్పాటు చేసిన రెండు సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్(సీఓఈ) కళాశాలల్లో ప్రవేశానికి రేపు (శనివా రం) ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నట్లు ఉమ్మడి వ రంగల్ జిల్లా కో–ఆర్డినేటర్ డాక్టర్ జే.సతీష్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. బాలికలకు నగరంలోని వరంగల్(జీ1), హనుమకొండ కేయూ క్రాస్‌రోడ్, బాలురకు వరంగల్(జీ2) వరంగల్, దూపకుంటరోడ్, శంభునిపేటలో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. రెండు కేంద్రాల్లో కలిపి 1,038 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకానున్నట్లు తెలిపారు.
పని చేయని ఫ్రాంకింగ్ మిషన్లు
కాజీపేట అర్బన్: ఉమ్మడి వరంగల్ జిల్లాలోని రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో ఉన్న ఫ్రాంకింగ్ మిషన్లు పని చేయట్లేదు. సుమారు నెల రోజులుగా బ్యాంకులో లోన్లు, ఆస్తికి తగ్గట్లు దస్తావేజుపై స్టాంప్ డ్యూటీ ఫ్రాంకింగ్ మిషన్స్ ద్వారా అందడం లేదు. దీంతో ఫ్రాంకింగ్ అవసరం ఉన్నవారు తప్పనిసరి పరిస్థితుల్లో ఉమ్మడి వరంగల్‌లోని వరంగల్ ఆర్‌ఓ, వరంగల్ రూరల్, వరంగల్ ఫోర్ట్, జనగామ, స్టేషన్ ఘన్‌పూర్‌లోని ఫ్రాంకింగ్ మిషన్లు పని చేయక హైదరాబాద్‌కు వెళ్లాల్సి వస్తోంది. రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు తక్షణమే ఫ్రాంకింగ్ మిషన్లను అందుబాటులోకి తీసుకురావాలని బ్యాంకు నుంచి లోన్లు తీసుకునేవారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నేటి నుంచి చింతలపల్లి రైల్వే గేట్ మూసివేత
సంగెం: మండలంలోని సంగెం–చింతలపల్లి రైల్వే లెవల్ క్రాసింగ్ నంబర్ 67 గేట్‌ను మరమ్మతుల నిమిత్తం మూడు రోజులపాటు మూసివేస్తున్నట్లు రైల్వే అధికారులు గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ నెల 13 నుంచి 15వ తేదీ వరకు ట్రాక్ మరమ్మతు పనులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వరంగల్–సంగెం ప్రధాన రహదారిలో ఈ రైల్వే గేట్ ద్వారా ప్రయాణించే ప్రభుత్వ, ప్రైవేట్ వాహనదారులు ఇతర మార్గాల ద్వారా ప్రయాణించి గమ్యస్థానాలకు చేరుకుని సహకరించాలని కోరారు.


