ముగిసిన మల్లన్న బ్రహ్మోత్సవాలు | - | Sakshi
Sakshi News home page

ముగిసిన మల్లన్న బ్రహ్మోత్సవాలు

Feb 18 2026 6:47 AM | Updated on Feb 18 2026 6:47 AM

ముగిస

ముగిసిన మల్లన్న బ్రహ్మోత్సవాలు

ముగిసిన మల్లన్న బ్రహ్మోత్సవాలు

ఐనవోలు: మల్లికార్జునస్వామి ఆలయంలో శివరాత్రి బ్రహ్మోత్సవాలు మంగళవారం ముగిశాయి. ఉత్సవాల్లో భాగంగా ఆలయ మాడవీధుల్లో స్వామి, అమ్మవార్లు పర్వత వాహనసేవపై ఊరేగారు. గవ్యాంత పూజలు, రుద్రహోమం, చండీహోమం, మృగయాత్ర, నిత్య ఉపాసన, బలిహరణ, మహా పూర్ణాహుతి, చూర్మోత్సవం, వసంతోత్సవం, త్రిశూల స్నానం తదితర కార్యక్రమాలను ఒగ్గుపూజారులు నిర్వహించారు. బ్రహ్మోత్సవాల ప్రారంభంలో సకలదేవతలను ఆహ్వానిస్తూ ధ్వజారోహణం చేశారు. ముగింపునకు చిహ్నంగా పరివార దేవతలకు ఉద్వాసన పలికారు. వేదమంత్రాల మధ్య ధ్వజారోహణ చేసి శివరాత్రి కల్యాణ బ్రహ్మోత్సవాలు ముగిసినట్లు అర్చకులు ప్రకటించారు. అనంతరం ఆశీర్వచనం, పండితులను సన్మానించారు. రాత్రి ఒగ్గు పూజారులు పవళింపు సేవ, పుష్పోత్సవం, ఏకాంత సేవలు జరిపించారు. ఆలయ కమిటీ చైర్మన్‌ కమ్మగోని ప్రభాకర్‌గౌడ్‌, ఈఓ కందుల సుధాకర్‌, ఉపప్రధాన అర్చకులు పాతర్లపాటి రవీందర్‌, ముఖ్య అర్చకులు శ్రీనివాస్‌, మధుకర్‌శర్మ, వేద పండితులు గట్టు పురుషోత్తమశర్మ, విక్రాంత్‌వినాయక్‌ శర్మ, అర్చకులు భానుప్రసాద్‌శర్మ, నరేశ్‌శర్మ, మధు శర్మ, శ్రీనివాస్‌, దేవేందర్‌, జూనియర్‌ అసిస్టెంట్‌ కిరణ్‌ కుమార్‌, అర్చకులు, సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.

ముగిసిన మల్లన్న బ్రహ్మోత్సవాలు1
1/1

ముగిసిన మల్లన్న బ్రహ్మోత్సవాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement