స్థానికేతరులు వెళ్లిపోవాలి
వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్‌సింగ్
వరంగల్‌క్రైం: మున్సిపల్ ఎన్నికల ప్రచారం సోమవారం ముగియనుండడంతో స్థానికేతరులు వెళ్లిపోవాలని పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్‌సింగ్ అన్నారు. వెళ్లకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధి స్టేషన్ ఘన్‌పూర్, జనగామ, పరకాల, వర్ధన్నపేట పట్టణాల్లో ప్రచారం ముగియనున్న నేపఽథ్యంలో వివిధ ప్రాంతాల నుంచి ప్రచారం నిమిత్తం వచ్చిన ఆయా పార్టీలకు చెందినవారు గమ్యస్థానాలకు తిరిగి వెళ్లాలని సూచించారు.
విలువలను
పెంపొందించుకోవాలి
కేయూ క్యాంపస్: విద్యార్థులు విద్యతోపాటు విలువలను కూడా పెంపొందించుకోవాలని కాకతీ య యూనివర్సిటీ వీసీ ప్రతాప్‌రెడ్డి సూచించారు. యూత్‌ఫర్ సేవాసంస్థ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు సాంస్కృతిక, సాహిత్య, సృజనాత్మక, ప్రతిభాపాటవ పోటీలను చిగురు కార్యక్రమం పేరుతో ఆదివారం నిర్వహించారు. ఈసందర్భంగా కేయూ ఆడిటోరియంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. మహనీయులను స్ఫూర్తిగా తీసుకొని లక్ష్యాలను సాధించాలని కోరారు. కేయూ రిజిస్ట్రార్ వి.రామచంద్రం మాట్లాడుతూ ఆసక్తి, అభిరుచి అనేవి విద్యార్థులను ముందుకు తీసుకెళ్లే శక్తులని పేర్కొన్నారు. తొలుత అతిథులు భారత మాత చిత్రపటానికి పూలమాలలు వేశారు. ఈసందర్భంగా విద్యార్థుల ప్రదర్శనలు అలరించాయి.
స్థానికేతరులు వెళ్లిపోవాలి


