నేరాలు, అవినీతిపై ఆగ్రహ జ్వాలలు  | Gen Z–led Protest in Mexico City, Video Goes Viral | Sakshi
Sakshi News home page

నేరాలు, అవినీతిపై ఆగ్రహ జ్వాలలు 

Nov 16 2025 9:57 AM | Updated on Nov 17 2025 4:49 AM

Gen Z–led Protest in Mexico City, Video Goes Viral

మెక్సికోలో జన్‌ జెడ్‌ నిరసనలు తీవ్రరూపం

 100 మంది పోలీసులు సహా 120 మందికి గాయాలు

మెక్సికో సిటీ: పెరుగుతున్న నేరాలు, అవినీతికి వ్యతిరేకంగా మెక్సికో రాజధాని మెక్సికో సిటీలో చేపట్టిన ర్యాలీకి వేలాదిగా జనం తరలివచ్చారు. జన్‌ జెడ్‌ గ్రూప్‌ సారథ్యం వహించిన ఈ ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనలు ప్రశాంతంగా జరిగినా కొన్ని చోట్ల యువత పోలీసులతో ఘర్షణ పడ్డారు. ఈ సందర్భంగా గాయపడిన 120 మందిలో 100 మంది పోలీసులేనని అధికారి ఒకరు తెలిపారు.

 ఇరవై మంది నిరసనకారులను పోలీసులు అరెస్ట్‌ చేశారన్నారు. అధ్యక్షురాలు క్లౌడియా షీన్‌బామ్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇతర నగరాల్లో కూడా జరిగిన ప్రదర్శనల్లో ప్రతిపక్ష పారీ్టల నేతలు కూడా పాల్గొన్నారు. నిరసన కారులు ఈ సందర్భంగా ఉరువపన్‌ నగర మేయర్‌ కార్లోస్‌ మంజో హత్యకు కారకులైన వారిని కఠినంగా శిక్షించాలన్నారు. 

డ్రగ్స్‌ ముఠాలపై ఉక్కుపాదం మోపాలని డిమాండ్‌ చేశారు. మాకు మరింత భద్రత కావాలంటూ ఆండెŠస్‌మస్సా అనే వ్యక్తి పుర్రె బొమ్మ కలిగిన జెండాను ప్రదర్శించారు. అధ్యక్ష భవనం నేషనల్‌ ప్యాలెస్‌ వద్ద పోలీసులు ఏర్పాటు చేసిన బారియర్లను నిరసనకారులు ధ్వంసం చేశారు. పోలీసులపై రాళ్లు రువ్వారు. వారిపై మండే పదార్థాలను విసిరేశారు. పోలీసుల వద్ద ఉండే షీల్డులను, ఇతర వస్తువులను లాగేసుకున్నారు. భవనం ప్రాంగణంలోకి ప్రవేశించేందుకు యతి్నంచిన నిరసనకారులను పోలీసులు టియర్‌గ్యాస్‌ ప్రయోగించి, అడ్డుకున్నారు. నవంబర్‌ ఒకటో తేదీన జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న మంజో గుర్తు తెలియని వ్యక్తి కాల్పుల్లో చనిపోయారు.

 డ్రగ్స్‌ ముఠాలు, డ్రగ్స్‌ రవాణాపై ఆయన తీవ్రంగా విమర్శలు చేయడమే ఇందుకు కారణమన్న అనుమానాలున్నాయి. అధ్యక్షురాలు షీన్‌బామ్‌ను 70 శాతం ప్రజలు అభిమానిస్తున్నారు. మత్తు మందు ఫెంటానిల్‌ అక్రమ రవాణాపై కఠినంగా వ్యవహరిస్తున్నారు. అయితే, సాయుధ ముఠాలను నియంత్రించడంలో విఫలమైనట్లు ఆమెపై ఆరోపణలున్నాయి. ఇదే అంశంపై చుట్టుపక్కల దేశాలు కూడా మెక్సికోతో విభేదిస్తున్నాయి. పెరూ ఇటీవలే మెక్సికోతో సంబంధాలను తెగదెంపులు చేసుకుంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement