లేహ్‌ లద్దాక్‌లో హైటెన్షన్‌.. బీజేపీ కార్యాలయానికి నిప్పు | Youth Protest In Ladakh Amid Statehood Demand Over Inclusion Of Ladakh Under The Sixth Schedule, Watch Video Viral | Sakshi
Sakshi News home page

Youth Protest In Ladakh: లేహ్‌ లద్దాక్‌లో హైటెన్షన్‌.. బీజేపీ కార్యాలయానికి నిప్పు

Sep 24 2025 3:48 PM | Updated on Sep 24 2025 6:13 PM

Youth Protest In Ladakh Amid Statehood Demand: Bjp Office Set On Fire

ఢిల్లీ: లద్దాఖ్‌లో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. లద్దాఖ్‌కు రాష్ట్ర హోదా కల్పించాలని డిమాండ్‌ చేస్తూ నిరసనకారులు పెద్ద ఎత్తున ఆందోళనలకు దిగారు. బీజేపీ కార్యాలయానికి నిప్పు పెట్టడంతో హై టెన్షన్‌ వాతావరణం నెలకొంది. లేహ్‌లోని బీజేపీ కార్యాలయంతో పాటు పోలీసు వాహనాలకు కూడా ఆందోళనకారులు నిప్పు అంటించారు. పరిస్థితి తీవ్ర ఉద్రిక్తంగా మారడంతో దీంతో బాష్పవాయువు ప్రయోగించి పోలీసులు.. నిరసనకారులను చెదరగొట్టారు.

నలుగురి మృతి..
నిరసనకారులు, పోలీసుల మధ్య ఘర్షణ జరిగింది. పోలీసులపై నిరసనకారులు రాళ్లు రువ్వారు. దీంతో పోలీసులు లాఠీఛార్జ్‌ చేశారు. రాష్ట్ర హోదా, 6వ షెడ్యూల్‌ అమలు కోసం డిమాండ్‌ చేస్తున్న నిరసనకారులు.. కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకే ఆందోళన చేస్తున్నామంటున్నారు. నగరంలో ఉద్రిక్తంగా మారిన నిరసనల నేపథ్యంలో నలుగురు మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. పలువురు గాయపడినట్లు తెలిపారు.

లద్దాఖ్ కు రాష్ట్ర హోదా ఇవ్వాలని విద్యార్థుల భారీ ఆందోళన

జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక హోదా కల్పించే ఆర్టికల్‌ 370ను 2019 ఆగస్టులో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కార్‌ రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఆ రాష్ట్రాన్ని జమ్మూకశ్మీర్, లద్దాఖ్ కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించడంతో.. రాష్ట్ర హోదా, 6వ షెడ్యూల్‌ అమలు కోసం డిమాండ్లు ఊపందుకున్నాయి. ఈ క్రమంలో రాష్ట్ర హోదా, రాజ్యాంగపరమైన భద్రతలు కల్పించాలన్న డిమాండ్‌తో ఆందోళనకారులు లేహ్‌ రోడ్లపైకి వచ్చి నిరసనలు చేపట్టారు.

 

 

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement