
సాక్షి, అనంతపురం: అనంతపురం కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. చంద్రబాబు సర్కార్‌పై ఎస్సీ, ఎస్టీ సంఘాల జేఏసీ భగ్గుమంది. రూరల్ డెవలప్‌మెంట్ ట్రస్ట్ (ఆర్డీటీ)కి నిధుల నిలిపివేతపై నిరసనకారులు మండిపడ్డారు. భారీ ర్యాలీతో కలెక్టరేట్‌ను ముట్టడించారు. నిరసన కార్యక్రమంలో వేలాది మంది పాల్గొన్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్‌లకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
నిస్వార్థ సేవలు అందిస్తున్న ఆర్డీటీ సంస్థపై ఎందుకు కక్ష సాధింపు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్డీటీ స్వచ్చంద సంస్థకు ఎఫ్‌సీఆర్‌ఏ చేయాలని డిమాండ్ చేశారు. ఎన్డీయేలో భాగస్వామి అయిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఎందుకు స్పందించలేదని నిరసన కారుల ధ్వజమెత్తారు.