పాకిస్తాన్‌ సర్కార్‌కు బిగ్‌ షాక్‌.. పీవోకేలో ఆందోళనలు.. ఇంటర్నెట్‌ బంద్‌ | Massive Protests In PoK internet Closed | Sakshi
Sakshi News home page

పాకిస్తాన్‌ సర్కార్‌కు బిగ్‌ షాక్‌.. పీవోకేలో ఆందోళనలు.. ఇంటర్నెట్‌ బంద్‌

Sep 29 2025 9:43 AM | Updated on Sep 29 2025 10:28 AM

Massive Protests In PoK internet Closed

శ్రీనగర్‌: పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్(POK) ఉద్రికత్త చోటుచేసుకుంది. పాక్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మౌలిక సంస్కరణలను కోరుతూ అవామీ యాక్షన్‌ కమిటీ ఆధ్వర్యంలో నిరసనలు ప్రారంభమయ్యాయి. ఇటీవల ఎన్నడూ లేనంత స్థాయిలో ఆందోళనలు చేపట్టడంతో భారీ సంఖ్యలో ప్రజలు రోడ్ల మీదకు వచ్చారు. దీనికి సంబంధించిన వీడియోలు బయటకు వచ్చాయి.

వివరాల ప్రకారం.. అవామీ యాక్షన్ కమిటీ (Awami Action Committee (AAC))  నాయకత్వంలో పాకిస్తాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వేలాది మంది పౌరులు పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (POK)లో భారీ నిరసనలు చేపట్టారు. కాగా, అవామీ యాక్షన్‌ కమిటీ.. 38 పాయింట్ల నిర్మాణాత్మక సంస్కరణలను డిమాండ్లను పాక్‌ ప్రభుత్వానికి ఇచ్చింది. పీఓకేలో మౌలిక సంస్కరణలు (Structural Reforms) తీసుకురావాలని.. తమ 38 డిమాండ్లను అమలుచేయాలని డిమాండ్‌ చేస్తూ ‘‘షటర్-డౌన్.. వీల్-జామ్’’ పేరుతో అవామీ యాక్షన్ కమిటీ సమ్మెకు పిలుపునిచ్చింది.​ ఇందులో ముఖ్యంగా.. పాకిస్తాన్‌లో నివసిస్తున్న కాశ్మీరీ శరణార్థుల కోసం రిజర్వు చేయబడిన పీవోకే అసెంబ్లీలో 12 శాసనసభ స్థానాలను రద్దు చేయాలని, ఇది ప్రాతినిధ్య పాలనను దెబ్బతీస్తుందని తెలిపింది.

ఈ సందర్బంగా అవామీ యాక్షన్ కమిటీ (ఏఏసీ) నాయకుడు షౌకత్ నవాజ్ మీర్ ముజఫరాబాద్‌లో మాట్లాడుతూ..‘మా ప్రచారం ఏ సంస్థకు వ్యతిరేకంగా కాదు. గత 70 సంవత్సరాలుగా మా ప్రజలకు నిరాకరించబడిన ప్రాథమిక హక్కుల కోసమే పోరాటం. ప్రజలకు హక్కులను అందించడం ప్రభుత్వం బాధ్యత అని చెప్పుకొచ్చారు. మరోవైపు.. పాక్‌ ప్రభుత్వం దశాబ్దాలుగా తమను రాజకీయంగా, ఆర్థికంగా అణగదొక్కుతున్నట్లు నిరసనకారులు తెలిపారు. 

ఈ క్రమంలో పీవోకేలోని పలు ప్రాంతాల్లో పౌరులు పాక్‌ బలవంతపు ఆక్రమణల నుంచి విముక్తి కల్పించాలని నినాదాలు చేస్తూ (Protests In PoK) రోడ్ల పైకి వచ్చారు. ప్రభుత్వం తమ డిమాండ్ల విషయంలో చర్చలు జరపడానికి ముందుకురావాలని అవామీ యాక్షన్‌ కమిటీ కోరింది. ప్రభుత్వం తమ డిమాండ్లను పట్టించుకోకపోతే నిరసనలను మరింత తీవ్రం చేస్తామని హెచ్చరించింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు తీవ్రమవుతుండడంతో ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పాక్‌ ప్రభుత్వం పీవోకేలో పెద్ద సంఖ్యలో పోలీసులను మోహరించింది. పంజాబ్‌ నుంచి వేల సంఖ్యలో పాక్‌ సైనికులు అక్కడికి చేరుకున్నట్టు పౌరులు తెలిపారు. ఇక, ఆందోళనల నేపథ్యంలో పీవీకే ఆదివారం అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్‌ సేవలను నిలిపివేశారు. చెక్‌ పోస్టులు, ప్రధాన ప్రాంతాల్లో పోలీసులు భారీ సంఖ్యలో మోహరించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement