సాక్షి, నెల్లూరు జిల్లా: దగదర్తిలోని దివంగత టీడీపీ నేత మాలేపాటి నివాసం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డికి నిరసన సెగ తగిలింది. మాలేపాటి సుబ్బానాయుడు ఇంటికెళ్లిన కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డిని మాలేపాటి వర్గీయులు అడ్డుకున్నారు. రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు సమక్షంలోనే కావ్య కృష్ణారెడ్డి గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. సుబ్బానాయుడిని ఎమ్మెల్యే ఇబ్బంది పెట్టారనే ఆరోపణలు ఉన్నాయి.. దీంతో కారు దిగకుండానే ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి వెనుదిరిగారు.


