మోటార్‌బైక్‌ను ఢీకొట్టిన వ్యాన్‌ | - | Sakshi
Sakshi News home page

మోటార్‌బైక్‌ను ఢీకొట్టిన వ్యాన్‌

Mar 16 2026 7:22 AM | Updated on Mar 16 2026 7:22 AM

ఒకరి మృతి

కలిగిరి: మోటార్‌బైక్‌ను వ్యాన్‌ వెనుక నుంచి ఢీకొట్టిన ఘటనలో మూకిరి రత్నరాజు (40) అనే వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందిన ఘటన ఆదివారం జరిగింది. పోలీసుల కథనం మేరకు.. ప్రకాశం జిల్లా వలపర్లకు చెందిన రత్నరాజు వింజమూరు మండలం గుండెమడకలలో పొగాకు బ్యారెన్ల వద్ద క్యూరింగ్‌ పనులు చేస్తున్నాడు. జాతీయ రహదారిపై కావలి వైపు నుంచి గుండెమడకలకు బైక్‌పై బయలుదేరాడు. అదే సమయంలో కావలి నుంచి కలిగిరి వెళ్తున్న మినీ పార్సిల్‌ వ్యాన్‌ పెద్దపాడు సమీపంలో వెనుక వైపు నుంచి బైక్‌ను ఢీకొట్టింది. దీంతో రత్నరాజు తలకు తీవ్రగాయాలై అక్కడికిక్కడే మృతిచెందాడు. స్థానికుల సమాచారంతో వచ్చిన 108 సిబ్బంది రత్నరాజు మృతిచెందినట్లు నిర్ధారించారు. కలిగిరి ఎస్సై ఉమాశంకర్‌ ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆత్మకూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. రత్నరాజుకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. ప్రమాదానికి కారణమైన వ్యాన్‌ డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement