జిల్లా వ్యాప్తంగా నాకాబందీ | - | Sakshi
Sakshi News home page

జిల్లా వ్యాప్తంగా నాకాబందీ

Mar 16 2026 7:22 AM | Updated on Mar 16 2026 7:22 AM

నెల్లూరు(క్రైమ్‌): నేరనియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణ చర్యల్లో భాగంగా జిల్లా వ్యాప్తంగా శనివారం రాత్రి నుంచి అర్ధరాత్రి వరకు పోలీసు అధికారులు నాకాబందీ నిర్వహించారు. హైవే ప్రవేశం, బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు, ప్రధాన కూడళ్లలో వాహన తనిఖీలు చేపట్టారు. డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌పై 19, బహిరంగంగా మద్యం తాగడంపై 24 కేసులు నమోదు చేశారు. మూడు వాహనాలను సీజ్‌ చేశారు. రహదారి భద్రత నిబంధనల ఉల్లంఘనపై 49 కేసులు నమోదు చేసి రూ.1,81,260ల అపరాధరుసుము విధించారు. లాడ్జీలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. బస చేసిన వ్యక్తుల వివరాలను సేకరించారు. అసాంఘిక కార్యకలాపాలు, అనుమానాస్పద వ్యక్తుల కదలికలు తదితరాలపై డయల్‌ 112, కంట్రోల్‌ రూమ్‌ ఫోన్‌ నంబర్‌ 93929 03143కు సమాచారం అందిస్తే తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement