త్రిపుర: బంగ్లాదేశ్‌లో నెలకొన్న ఉద్రికతల నేపథ్యంలో భారత్ అప్రమత్తమైంది. బంగ్లా సరిహద్దు రాష్ట్రం త్రిపురాలో భద్రతా చర్యల్ని కఠినతరం చేసింది. త్రిపుర సీఎం మాణిక్ సాహా ఆదేశాలతో సరిహద్దు జిల్లాల్లో అదనపు పోలీసు బలగాలు మోహరించాయి.
బంగ్లాదేశ్‌లో కొన్ని ప్రాంతాల్లో నిరసనలు, హింసాత్మక ఘటనలు చోటుచేసుకోవడంతో అక్కడి పరిస్థితి ఉద్రికత్తగా మారింది. సరిహద్దు ప్రాంతాల్లో అక్రమ చొరబాట్లు, శరణార్థుల ప్రవాహం పెరిగే అవకాశం ఉందని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. సరిహద్దు జిల్లాల్లో అదనపు పోలీసు బలగాలు,బీఎస్‌ఎఫ్ సిబ్బంది నిత్యం పహారా కాస్తున్నాయి. అదే సమయంలో ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రభుత్వం అన్నీ రక్షణ చర్యల తీసుకుంటోందని త్రిపురా సీఎం స్పష్టం చేశారు.
మరోవైపు,బంగ్లాదేశ్‌లో అశాంతి కొనసాగితే, రెండు దేశాల మధ్య వాణిజ్యం, రవాణా, సాంస్కృతిక సంబంధాలు ప్రభావితం కావచ్చు. అక్రమ వలసలు, స్మగ్లింగ్ వంటి సమస్యలు పెరిగే అవకాశం ఉందని భద్రతా వర్గాలు హెచ్చరిస్తున్నాయి. బంగ్లాదేశ్ అశాంతి త్రిపురా, అసోం, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాల సరిహద్దు ప్రాంతాలకు ప్రత్యక్ష ముప్పుగా మారవచ్చు.
త్రిపురా ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోవడం ద్వారా ప్రజల్లో నమ్మకం కలిగించడానికి ప్రయత్నిస్తోంది. స్థానిక ప్రజలు భద్రతా చర్యలను స్వాగతిస్తున్నప్పటికీ, సరిహద్దు ప్రాంతాల్లో ఆందోళన కొనసాగుతోంది.


