
సాక్షి,హైదరాబాద్: చంచల్ గూడ జైలులో రాజకీయ ఖైదీలు నిరాహార దీక్ష చేపట్టినట్లు ప్రజాసంఘాలు ఆరోపించాయి. జైలు అధికారుల తీరుకు నిరసనగా మావోయిస్టు ఖైదీలు నిరాహార దీక్ష చేస్తున్నట్లు పేర్కొన్నాయి. అయితే.. తమ జైలులో ఏడుగురు మావోయిస్టు ఖైదీలున్నారని చంచల్‌గూడ్ జైలు సూపరింటెండెంట్ శివకుమార్ గౌడ్ ‘సాక్షి డిజిటల్’కు తెలిపారు. రొటీన్ ప్రాసెస్‌లో భాగంగా సోమవారం వారి బ్యారక్‌లను మార్చామని, అంతకు మించి ఏమీ జరగలేదని పేర్కొన్నారు. వారికి మద్దతుగా పలు ప్రజాసంఘాలు ఈరోజు ధర్నా చేశాయని, వారి తరఫున అడ్వొకేట్లు నలుగురు జైలులో పరిస్థితిని పరిశీలించారని వివరించారు. ప్రజాసంఘాల నేతలతో మావోయిస్టు ఖైదీలకు ములాఖత్ ఏర్పాటు చేశామన్నారు.