
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సెక్రటేరియట్ వద్ద ఉద్యోగులు నిరసనలకు దిగారు. ఉద్యోగులకు పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నారు. కాసేపట్లో ఉద్యోగులు సెక్రటేరియట్‌లోని మీడియా పాయింట్ వద్ద మాట్లాడే అవకాశం ఉంది. మరోవైపు.. సాయంత్రం నాలుగు గంటలకు సెక్రటేరియట్‌లో వరదలపైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించనున్నారు. అన్ని శాఖల ఉన్నతాధికారులు సమీక్షలో పాల్గొననున్నారు.