సాక్షి, విశాఖపట్నం: గీతం భూ దోపిడీపై సీపీఎం నిరసన చేపట్టింది. గీతం యూనివర్సిటీ ముందు సీపీఎం నేతలు ఆందోళనకు దిగారు. గీతం భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేశారు. 5 వేల కోట్ల భూములను ఏ విధంగా గీతం యూనివర్శిటీకి కట్టబెడతారంటూ ప్రభుత్వాన్ని సీపీఎం నేతలు నిలదీశారు. ప్రభుత్వం ప్రజా ఆస్తులుకు రక్షణగా ఉండాలి. ప్రభుత్వ భూమిని కబ్జా చేసిన భరత్‌పై చర్యలు తీసుకోవాలన్నారు. చంద్రబాబు బంధువైన అంత మాత్రాన ఎంపీ భరత్‌కు 55 ఎకరాల భూమి కట్టబెడతారా? అంటూ సీపీఎం నేతలు మండిపడ్డారు.

గీతం యూనివర్సిటీ దగ్గర సీఐ మల్లేశ్వరరావు ఓవరాక్షన్
గీతం యూనివర్సిటీ దగ్గర సీఐ మల్లేశ్వరరావు అత్యుత్సాహం ప్రదర్శించారు. సీపీఎం నేతలు గీతం యూనివర్సిటీ ముందు ఆందోళన చేయడానికి వీల్లేదంటూ సీఐ అడ్డుకున్నారు. దీంతో సీఐతో సీపీఎం నేతలు వాగ్వాదానికి దిగారు. నిరసనను అడ్డుకునే హక్కు మీకు ఎవరు ఇచ్చారంటూ సీఐని సీపీఎం నేతలు నిలదీశారు. శాంతియుత నిరసన.. రాజ్యాంగం కల్పించిన హక్కు అని సీపీఎం నేతలు పేర్కొన్నారు.


