
సాక్షి, వెలగపూడి: ఏపీ అసెంబ్లీ వద్ద పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీలు శుక్రవారం ఉదయం అసెంబ్లీకి ర్యాలీగా వచ్చారు. ఆ సమయంలో ఆ శాంతియుత ర్యాలీని అడ్డుకున్న పోలీసులు.. సభ్యులతో వాగ్వాదానికి దిగారు. అదే సమయంలో ర్యాలీని కవరేజ్ చేస్తున్న మీడియాపైనా పోలీసులు దౌర్జన్యానికి దిగారు. దీంతో కాసేపు అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
