ప్రధాని రాజీనామా.. నేపాల్‌లో సైనిక పాలన? | Nepal Crisis Deepens: Gen Z Protests Target PM Oli, Ministers Resign, India Issues Advisory | Sakshi
Sakshi News home page

ప్రధాని రాజీనామా.. నేపాల్‌లో సైనిక పాలన?

Sep 9 2025 12:38 PM | Updated on Sep 9 2025 2:34 PM

Nepal GenZ Protest Live September 9th Live Updates

నేపాల్‌లో రాజకీయ సంక్షోభం నెలకొంది. యువత(Gen Z) హింసాత్మక ఆందోళనలకు దిగొచ్చిన కేపీ శర్మ ఓలీ తన ప్రధాని పదవికి రాజీనామా చేశారు. సైన్యం సూచన మేరకే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో తనను సురక్షితంగా దేశం దాటించాలనే షరతు మీద ఆయన సైన్యం చెప్పింది చేసినట్లు అక్కడి మీడియా కథనాలు ఇస్తోంది.  

నేపాల్‌లో సోషల్‌ మీడియా బ్యాన్‌ యువతకు కోపం తెప్పించింది. ఇది అవినీతిని ప్రశ్నించే గొంతుకలను అణచివేయడమేనంటూ ప్రభుత్వ వ్యతిరేక నిరసనలకు దిగింది. అదే సమయంలో నేపాల్‌ నేతల వారసుల విలాసాలపైనా అందుబాటులో ఉన్న టిక్‌టాక్‌ లాంటి ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా నిలదీసింది. ఈ క్రమంలో సోమవారం ఆ ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. సైన్యాన్ని రంగంలోకి దించినా.. పరిస్థితి ఏమాత్రం చల్లారలేదు. ఖాట్మండు సహా పలు ప్రాంతాల్లో జరిగిన ఆందోళనల్లో 19 మంది మరణించారు. దీంతో.. రాత్రికి రాత్రే ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. అయితే.. 

సోషల్‌ మీడియాపై బ్యాన్‌ ఎత్తేసినప్పటికీ.. వరుసగా రెండోరోజు మంగళవారం కూడా ఆందోళనకారులు తమ నిరసనలు కొనసాగించారు. ఈ క్రమంలో.. ఖాట్మండులోని అధ్యక్ష భవనం శీతల్‌ నివాస్‌తో పాటు ప్రధాని ఓలీ నివాసం, కార్యాలయంలోకి చొచ్చుకెళ్లారు. విధ్వంసం సృష్టించడంతో పాటు వాటికి నిప్పు పెట్టారు. ఈ క్రమంలో దాడి దృశ్యాలు.. నెట్టింటకు చేరాయి. అధ్యక్షుడు రామ్‌ చంద్ర పౌడెల్‌ ప్రైవేట్‌ నివాసంతో పాటు నేపాల్‌ కాంగ్రెస్‌ భవనం, పలువురు నేతల ఇళ్లనూ నిరసనకారులు వదల్లేదు. అదే సమయంలో..  

అంతేకాదు ఆయన కార్యాలయంలోకి ఆందోళనకారులు చొరబడిన పరిస్థితులు ఏర్పడ్డాయి. వరుసగా మంత్రులు రాజీనామా చేయడం.. హింసాత్మక ఆందోళనలు మరింత ఉధృతరం కావడం, అదే సమయంలో సైన్యం ఒత్తిడితో ఆయన రాజీనామా చేసినట్లు సమాచారం. నేపాల్‌లో సైనిక పాలనా?.. లేకుంటే కొత్త ప్రధానిని ఎన్నుకుంటారా? అనే దానిపై సాయంత్రం లోగా స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

 

తాజా పరిస్థితుల దృష్ట్యా ఖాట్మండులో నిరవధిక కర్ఫ్యూ విధించారు. అయినప్పటికీ  ఆ దేశాలను ధిక్కరిస్తూ నిరసనకారులు  ఆందోళన కొనసాగిస్తున్నారు. మరోవైపు.. ఇవాళ సాయంత్రం ఆల్‌పార్టీ మీటింగ్‌కు పిలుపు ఇచ్చిన ప్రధాని ఓలీ..ఈలోపే అనూహ్య నిర్ణయం తీసుకోవడం విశేషం. 

ప్రధాని ఓలీకి వరుస దెబ్బలు
ఆందోళనలు కొనసాగుతున్న సమయంలో నేపాల్‌ ప్రధాని కేపీ శర్మ ఓలీకి రాజకీయంగా వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. నిరసనలు హింసాత్మకంగా మారడంతో నైతిక బాధ్యత వహిస్తూ హోంమంత్రి రమేశ్‌ లేఖక్‌ సోమవారం తన పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఆపై పదవి నుంచి వైదొలుగుతున్నట్లు ఆ దేశ వ్యవసాయ శాఖ మంత్రి రామ్‌నాథ్ అధికారి ప్రకటించారు. తాజా యువత ఆందోళనలకు మద్దతుగా నీటి సరఫరా శాఖ మంత్రి ప్రదీప్‌ యాదవ్‌ రాజీనామా చేశారు. 

అయితే ఈ వరుస రాజీనామాలను యువత పట్టించుకోలేదు. కర్ఫ్యూ, ఆంక్షలను చేధించుకుని మరీ వెళ్లి రాజీనామా చేసినవాళ్లతో పాటు ఇతర నేతల ఇళ్లకు నిప్పంటిస్తూ వస్తున్నారు. పలువురు నేతల నివాసాలతో పాటు వాళ్ల ప్రైవేట్‌ ఆస్తులకూ నిరసనకారులు నిప్పుపెట్టినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. 

భారతీయులకు అడ్వైజరీ
నేపాల్‌ ఆందోళనల దృష్ట్యా భారతీయులకు భారత విదేశాంగశాఖ ఓ అడ్వైజరీ జారీ చేసింది. ‘‘నేపాల్‌లో జరుగుతున్న పరిణామాలను మేము నిశితంగా పరిశీలిస్తున్నాం.  ఖాట్మాండు సహా నేపాల్‌లోని ఇతర నగరాల్లో అధికారులు కర్ఫ్యూ విధించినట్లు గమనించాం. అనేకమంది ప్రజలు ప్రాణాలు కోల్పోవడం బాధాకరం. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాము. అక్కడి అధికారుల సూచనలు అనుసరిస్తూ.. నేపాల్‌లోని భారత పౌరులు అప్రమత్తంగా ఉండాలి’’ అని విదేశాంగశాఖ పేర్కొంది. నేపాల్‌ ప్రభుత్వం శాంతియుత మార్గాలు, చర్చల ద్వారా సమస్యను పరిష్కరిస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement