
కాఠ్మాండూ: నేపాల్‌లో రాజకీయ ఉద్రిక్తతలు మరోసారి ముదిరాయి. ఆర్థిక మంత్రి బర్షమాన్ పున్‌పై జరిగిన దాడి దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. ఇటీవల ఒక కార్యక్రమానికి హాజరైన మంత్రి పున్‌ను జెన్‌జీ ఆందోళనకారులు వెంటపడిమరీ దాడి చేశారు. ఆందోళ కారుల్లో ఓ వ్యక్తి పున్‌ను ఫుట్‌బాల్ తన్నినట్లు తన్నారు. ఆ ఊహించిన పరిణామంతో పున్ ఎగిరి అవుతలపడ్డారు. అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
ఆర్థిక మంత్రిగా పనిచేస్తున్న బర్షమాన్ పున్ ఇటీవల ప్రభుత్వ విధానాలపై తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. దేశంలో పెరుగుతున్న ధరలు, ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో ప్రజల్లో అసంతృప్తి పెరిగింది. ఈ క్రమంలో ఆయనపై ప్రజలు తమ కోపాన్ని వ్యక్తం చేశారు.
వీడియోలో మంత్రి పున్ ఒక వీధిలో నడుస్తుండగా, కొంతమంది వ్యక్తులు ఆయనను వెంబడిస్తూ తిడుతూ,దేహశుద్ధి చేశారు. భద్రతా సిబ్బంది ఆయనను రక్షించేందుకు ప్రయత్నించినా, ఆగ్రహంతో రగిలిపోతున్న ఆందోళన కారుల నుంచి రక్షించేందుకు విశ్వప్రయాత్నాలు చేశారు. చివరకు వారి చేతుల్లో బర్షమాన్ పున్ ప్రాణాలు కోల్పోకుండా కాపాడగలిగారు.
ఈ ఘటనపై నేపాల్ రాజకీయ వర్గాలు, సామాజిక కార్యకర్తలు తీవ్రంగా స్పందిస్తున్నారు. ప్రజల ఆగ్రహాన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని కొందరు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు, ప్రజాస్వామ్యంలో శాంతియుతంగా అభిప్రాయాలు వ్యక్తం చేయాలని పిలుపు కూడా వినిపిస్తోంది.
Finance minister of NEPAL got an unexpected kick from common people of Nepal.pic.twitter.com/mMZRsU9tFj
— Karthik Reddy (@mbkartikreddy) September 9, 2025