
ఇస్లామాబాద్: పాకిస్థాన్‌ను బలోచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ, ఐఎస్‌ఐఎస్-ఖోరాసన్, తెహ్రీక్-ఏ-తాలిబన్ పాకిస్థాన్ వంటి ఉగ్ర సంస్థలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్న నేపథ్యంలో.. తాజాగా మరో మిలిటెంట్ గ్రూపు తెహ్రీక్-ఎ-లబ్బైక్ పాకిస్థాన్ (TLP) చేపట్టిన ‘లబ్బైక్ యా అక్సా మిలియన్ మార్చ్’ తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది.
పాలస్తీనాకు మద్దతుగా, ఇజ్రాయెల్ వ్యతిరేకంగా రావల్పిండిలో టీఎల్‌పీ కార్యకర్తలు పెద్ద ఎత్తున నిరసనకు దిగారు. ఈ ఆందోళన కారణంగా పాకిస్తాన్‌లోని పలు ప్రధాన నగరాల్లో ట్రాఫిక్ స్తంభించింది. రవాణా రాకపోకలు నిలిచిపోయాయి. జనజీవనం స్థంభించిపోయింది.

ఈ క్రమంలో పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు సున్నిత ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. టీఎల్‌పీ నిరసనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీచార్జ్, టియర్ గ్యాస్ ప్రయోగించారు. ప్రతి చర్యగా టీఎల్‌పీ కార్యకర్తలు పోలీసులపై రాళ్లు రువ్వారు. పోలీసు వాహనాల్ని ధ్వంసం చేశారు. వారిని అదుపులోకి తెచ్చేందుకు భారీ ఎత్తున పోలీసులు మోహరించారు. 65 మంది TLP కార్యకర్తలను అరెస్ట్ చేశారు. వారిపై శాంతి భంగం, ప్రభుత్వ ఆస్తుల నష్టం, ప్రజల రవాణాకు అడ్డంకులు కలిగించడం వంటి అభియోగాలు నమోదు చేశారు.

ఈ ఘటనపై పాక్ పంజాబ్ ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. దేశంలో శాంతి భద్రతలను కాపాడటం తమ ప్రాధాన్యత అని అధికార ప్రతినిధులు పేర్కొన్నారు. మరోవైపు, TLP నాయకులు తమ కార్యకర్తలపై పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారని ఆరోపించారు. శాంతియుతంగా నిరసన తెలిపిన వారిని అరెస్ట్ చేయడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధం అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. త్వరలోనే తమ ఉద్యమాన్ని మరింత ఉదృతం చేస్తామని హెచ్చరించారు.
Tehreek-e-Labbaik workers forcibly took away a Pakistani police vehicle.
This shows exactly how far Pakistan has fallen. Radical mobs are now ruling cities, and the state that cultivated them is watching helplessly.
Chaos has become permanent.@LtGenDPPandey @EPxInsights pic.twitter.com/4rKPpPysjm— Stuti Bhagat (@StutiBhagat_) October 11, 2025