
సాక్షి, విశాఖపట్నం: స్టీల్ ప్లాంట్ వద్ద కార్మికులు నిరసన చేపట్టారు. తమ జీతాలు తక్షణమే చెల్లించాలంటూ అడ్మిన్ బిల్డింగ్ దగ్గర నిరసనకు దిగారు. కంచాలతో భిక్షాటన చేస్తూ కార్మికులు నిరసన తెలిపారు. జీతాలు ఇవ్వకపోవడం వలన పిల్లలకు తిండి పెట్టలేక పోతున్నామని.. ఫీజులు కట్టలేక పోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.
‘‘ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను కూటమి నేతలు నిలబెట్టుకోవాలి. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ స్టీల్ ప్లాంట్‌ను కాపాడతామన్నారు. కార్మికులు అర్ధాకలితో ఉంటే చంద్రబాబు, పవన్ కల్యాణ్ కనీసం స్పందించడం లేదు. కూటమి ప్రభుత్వానికి ప్రజలు తగిన బుద్ది చెప్పే రోజులు త్వరలోనే ఉన్నాయి’’ అంటూ స్టీల్ ప్లాంట్ కార్మికులు హెచ్చరించారు.