తిరుమల: తిరుమలలో మంగళవారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లోని 19 కంపార్ట్‌మెంట్లు నిండిపోయాయి. సోమవారం అర్ధరాత్రి వరకు 81,345 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 26,150 మంది భక్తులు త లనీలాలు అర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.4 కోట్లు సమర్పించారు. టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. టికెట్లు లేని వారు స్వామి వారిని దర్శించుకోవడానికి 12 గంటల సమయం పడుతోంది.


