
ప్రభుత్వం తీరును నిరసిస్తూ అక్టోబర్ 12న చలో హైదరాబాద్
ఉద్యోగుల జేఏసీ నిర్ణయం
సెప్టెంబర్ లో బస్సు యాత్రలు.. లక్ష మంది ఉద్యోగుల సమీకరణ
63 డిమాండ్ల సాధన కోసం ఉద్యమ కార్యాచరణ ఖరారు
వేచి చూశాం... ఓపిక నశించిందన్న జేఏసీ నేతలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వంపై ఉద్యోగులు జంగ్ సైరన్ మోగించారు. తమ సమస్యల పరిష్కారంలో ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టబోతున్నట్టు ఉద్యోగ సంఘాల జేఏసీ ప్రకటించింది. టీఎన్‌జీవో భవన్‌లో మంగళవారం జేఏసీ విస్తృత స్థాయి సన్నాహక సమావేశం జరిగింది. ఉద్యోగ, ఉపాధ్యాయ, గెజిటెడ్ అధికారులు, కార్మిక, పెన్షనర్లకు చెందిన 206 సంఘాల నేతలు సమావేశంలో పాల్గొన్నారు. అక్టోబర్ 12న లక్ష మంది ఉద్యోగులతో చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని నిర్వహించాలని జేఏసీ సమావేశం తీర్మానించింది.
సెప్టెంబర్ 1న విద్రోహ దినంగా మొదలయ్యే ఆందోళన, జిల్లాల్లో బస్సు యాత్రలు చేపట్టాలని, అంతిమంగా జంగ్ సైరన్‌తో చలో హైదరాబాద్‌ను విజయవంతం చేయాలని నిర్ణయించింది. 63 డిమాండ్ల సాధన కోసం ఉద్యమ కార్యాచరణను జేఏసీ ఖరారు చేసింది. సమావేశ వివరాలను జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్, సెక్రెటరీ జనరల్ ఏలూరు శ్రీనివాసరావు మీడియాకు వివరించారు.
ప్రభుత్వంపై నమ్మకం పోయింది
ఎన్నికల ముందు ఎన్నో వాగ్దానాలిచి్చన ప్రభుత్వం రెండేళ్లవుతున్నా ఉద్యోగుల సమస్యలపై ఏమాత్రం దృష్టి పెట్టలేదని మారం జగదీశ్వర్ అన్నారు. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, కేబినెట్ సబ్ కమిటీల చుట్టూ తిరిగినా ప్రయోజనం కన్పింంచలేదన్నారు. రెండేళ్లయినా పీఆర్‌సీ కమిటీ నివేదిక ఏమైందో తెలియదన్నారు. జేఏసీ నేతలు వెళ్లినా గుర్తుపట్టలేని స్థితిలో మంత్రులు ఉండటం దారుణమన్నారు. ప్రతి నెలా 1న వేతనం ఇవ్వడమే గొప్పగా చెబుతున్న ప్రభుత్వం, తాము కష్టపడి పనిచేస్తేనే జీతం ఇస్తున్నారనే వాస్తవాన్ని విస్మరించడం దుర్మార్గమన్నారు.
ప్రభుత్వం నుంచి బకాయిలు రాక, ఆర్థిక ఇబ్బందులతో ఉద్యోగులు ఆత్మహత్యలు చేసుకునే దయనీయ పరిస్థితి వచి్చందని చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగి అంటే పిల్లనివ్వడానికి వెనుకాడుతున్నారన్నారు. ప్రభుత్వంపై నమ్మకం కోల్పోయి, ఓపిక నశించి, రాజకీయాలకు అతీతంగా ఉద్యమానికి సిద్ధమవుతున్నామని జగదీశ్వర్ తెలిపారు. లక్ష్యం నెరవేరే వరకూ ఎవరికీ భయపడేది లేదన్నారు.
ఉద్యోగుల వాణి విన్పింస్తాం
రాష్ట్రంలోని ఉద్యోగులందరినీ ఏకం చేస్తామని, తమ ఆగ్రహాన్ని ప్రభుత్వానికి తెలియజేస్తామని జేఏసీ సెక్రెటరీ జనరల్ ఏలూరు శ్రీనివాసరావు తెలిపారు. ఉద్యోగుల్లో ఆవేశం కట్టలు తెంచుకుంటోందని, తాము కూడా వారి ఆగ్రహాన్ని కట్టడి చేయలేమన్నారు. సెప్టెంబర్ 1న పాత పెన్షన్ సాధన సదస్సును హైదరాబాద్‌లో చేపడతామని తెలిపారు. వచ్చేనెల 8 నుంచి జిల్లాల్లో బస్సు యాత్రలు చేపడుతున్నట్టు తెలిపారు. సమావేశంలో పలు ఉపాధ్యాయ, ఉద్యోగ, పెన్షనర్ల, గెజిటెడ్ అధికారుల సంఘాలు, కార్మిక సంఘాల నేతలు పాల్గొన్నారు.
ప్రధాన డిమాండ్లు ఇవీ..
పెండింగ్‌లో ఉన్న 5 డీఏలను తక్షణమే విడుదల చేయాలి. ఈహెచ్‌ఎస్ ఆరోగ్య పథకం నిబంధనలు రూపొందించాలి. కేబినెట్ సమావేశంలో ఆమోదించిన విధంగా నెలకు రూ.700 కోట్ల పెండింగ్ బిల్లులు క్రమం తప్పకుండా చెల్లించాలి. కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలి. ఏకీకృత సర్వీసు రూల్స్ అమలుకు ఆదేశాలివ్వాలి. పీఆర్సీ నివేదికను వెంటనే తెప్పించుకుని 51 శాతం ఫిట్‌మెంట్ అమలు చేయాలి. గచి్చ»ౌలి స్థలాలను భాగ్యనగర్ టీఎన్జీవోలకు కేటాయించాలి. శాఖల్లో పదోన్నతుల కమిటీలను ఏర్పాటు చేసి ప్రమోషన్లు ఇవ్వాలి.