
కృష్ణాజిల్లా: జనసేన ఎంపీ బాలశౌరి కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఎంపీ బాలశౌరి పీఏ గోపాల్ సింగ.. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇప్పిస్తాననని మోసం చేసిన ఘటనపై బాధితులు ఆందోళన చేపట్టారు. నిరుద్యోగులను నిండా ముంచేసిన బాలశౌరి పీఏ గోపాల్ సింగ్.. కోటిన్నర రూపాయలు వరకూ వసూలు చేసినట్లు తెలుస్తోంది. 60 మంది వద్ద రెండు లక్షల చొప్పున వసూలు చేశారు గోపాల్ సింగ్.
గతంలో ఫేక్ అపాయింట్‌మెంట్ లెటర్లు ఇచ్చిన ఎంపీ పీఏ గోపాల్‌సింగ్.. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో అపాయింట్‌మెంట్ లెటర్ల గడువు ముగిశాయంటూ తప్పించుకునే ప్రయత్నం చేశాడు. విజయవాడలోని నోవాటెల్‌కు వస్తే మళ్లీ కొత్తగా అపాయింట్‌మెంట్ లెటర్లు ఇస్తానని నమ్మించాడు గోపాల్ సింగ్.
దాంతో నిన్న (శుక్రవారం, ఆగస్టు 1వ తేదీ) నోవాటెల్ హోటల్‌కు బాధితులు వెళ్లగా, అక్కడకు గోపాల్ సింగ్ రాలేదు. ఈ నేపథ్యంలో మోసపోయామని గుర్తించిన బాధితులు.. తమకు న్యాయం చేయాలంటూ ఎంపీ బాలశౌరి కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. ఎంపీ కార్యాలయం వద్ద ఆందోళన చేయకూడదని వారిని పోలీసులు బెదిరింపులకు దిగారు.
