సాక్షి, విశాఖపట్నం: జీవీఎంసీ కౌన్సిల్ సమావేశంలో వైఎస్సార్‌సీపీ సభ్యులు ఆందోళనకు దిగారు. మీడియాను అనుమతించాలంటూ వైఎస్సార్‌సీపీ డిమాండ్ చేసింది. మేయర్ పోడియం వద్ద వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్లు బైఠాయించారు. గీతం భూ దోపిడీని అరికట్టాలని వైఎస్సార్‌సీపీ డిమాండ్ చేసింది. గీతం భూముల వ్యవహారంపై జీవీఎంసీ కౌన్సిల్ సమావేశం దద్దరిల్లింది. జీవీఎంసీ కౌన్సిల్‌లో మేయర్ పీలా శ్రీనివాస్ దౌర్జన్యానికి దిగారు. వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్లను మేయర్ తోసేశారు. కౌన్సిల్‌లో టీడీపీ కార్పొరేటర్లు బీభత్సం సృష్టించారు. 62వ వార్డు వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్ లక్ష్మణరావు కాలికి గాయమైంది.
చర్చ జరగకుండానే గీతంకు భూములు కేటాయింపు..
అధికార దుర్వినియోగంతో గీతం భూములను చంద్రబాబు సర్కార్ క్రమబద్దీకరించింది. చర్చ జరగకుండానే గీతంకు భూములను కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. వైఎస్సార్‌సీపీ సభ్యులను సస్పెండ్ చేసి ఏకపక్షంగా ఆమోదించింది. వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్లపై దాడి చేసిన మేయర్, టీడీపీ కార్పొరేటర్లు.. కౌన్సిల్‌లో గూండాయిజం ప్రదర్శించారు.
జీవీఎంసీ కౌన్సిల్ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. విశాఖలో కూటమి భూదోపీడీపై విపక్షాలు పోరుబాట పట్టాయి. కౌన్సిల్ సమావేశాన్ని అడ్డుకునేందుకు వామపక్షాలు యత్నించాయి. అంతకుముందు గీతం భూ కబ్జాపై జీవీఎంసీ ఎదురుగా గల గాంధీ విగ్రహం వద్ద వైఎస్సార్‌సీపీ నిరనస చేపట్టింది. ఈ ఆందోళన కార్యక్రమంలో శాసనమండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ, రీజనల్ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు, ఎంపీ గొల్ల బాబూరావు, మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్, సమన్వయకర్తలు వాసుపల్లి గణేష్‌కుమార్, మళ్ల విజయప్రసాద్, మొల్లి అప్పారావు, దేవన్‌రెడ్డి, ఎమ్మెల్సీలు వరుదు కల్యాణి, కుంబా రవిబాబు, పండుల రవీంద్రబాబు పాల్గొన్నారు.
గీతం ’కబ్జా’ భూముల చిట్టా ఇదే..
గీతం విశ్వవిద్యాలయం, ఆసుపత్రి యాజమాన్యం ఆక్రమణలో ఉన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న భూముల వివరాలివి.. ఎండాడ గ్రామ సర్వే నంబర్ 15/1 నుంచి 15/5 వరకు 24.51 ఎకరాలు, 16/4లో 1.95 ఎకరాలు, 17/27లో 1.01 ఎకరాలు, 17/30లో 1.09 ఎకరాలు, 18/2లో 1.03 ఎకరాలు, 20/5లో 5.60 ఎకరాలు, 20/10లో 1.50 ఎకరాలు, 20/12లో 0.10 ఎకరాలు, 191/1లో 0.48 ఎకరాలు, 191/2లో 0.86ఎకరాలు, 191/9లో 0.70 ఎకరాలు కలిపి మొత్తం 42 ఎకరాల 39 సెంట్లు.
రుషికొండ గ్రామ సర్వే నంబర్ 37/2లో 4.29 ఎకరాలు, 38/1బిలో 7.27 ఎకరాలు, 53/4లో 0.03 ఎకరాలు, 55/3లో 0.35 ఎకరాలు, 61/5లో 0.40 ఎకరాలు, 61/5లో 0.06 ఎకరాలు.. కలిపి మొత్తం విస్తీర్ణం 2 ఎకరాల 40 సెంట్లు. ఈ రెండు గ్రామాల్లో కలిపి ఎంపీ శ్రీభరత్ కుటుంబం ఆ«దీనంలోని గీతం సంస్థల చేతిలో ఉన్న మొత్తం ప్రభుత్వ భూమి 54.79 ఎకరాలు.


