చిత్తూరు అర్బన్: ‘ఏం నీకు ఎన్నిసార్లు చెప్పాలి? మాకేం వేరే పనిలేదా? ముందు స్టేషన్‌కి రా.. వచ్చి కేసును రాజీచేసుకో..’ అంటూ ఓ పోలీసు అధికారి మహిళా న్యాయవాదికి ఫోన్‌చేసి బెదిరించారు. జిల్లా కేంద్రం చిత్తూరులో జరిగిన ఈ ఘటన చర్చనీయాంశంగా మారింది. నగరానికి చెందిన ఓ మహిళా న్యాయవాది ఒకరిపై గతంలో ఫిర్యాదు చేయగా స్టేషన్‌లో కేసు నమోదైంది. ఆమెపైన కూడా కౌంటర్ కేసు ఉంది. దీనిపై చట్టప్రకారం ముందుకెళ్లాలని నిర్ణయించుకున్న మహిళా న్యాయవాది కేసును కోర్టులోనే తేల్చుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇదే విషయాన్ని సంబంధిత స్టేషన్ హౌస్ ఆఫీసర్‌కు చెప్పారు. కానీ రాజకీయ నేతల నుంచి ఆ పోలీసు అధికారికి ఫోన్ వచ్చింది. కేసు రాజీచేయించాలని ఆదేశించారు. దీంతో రెచ్చిపోయిన ఆ అధికారి.. మహిళా న్యాయవాదికి ఫోన్‌చేసి దురుసుగా మాట్లాడారు. దీంతో ఫోన్‌కాల్ కట్‌చేసిన ఆమె ఎస్పీకి ఫిర్యాదు చేసేందుకు సమాయత్తమవుతున్నారు.


