కుప్పంలో వందే భారత్ రైలుకు హాల్ట్ ఇవ్వండి
– రైల్వే మంత్రిని కలిసిన
ఎంపీ మిథున్‌రెడ్డి
కుప్పం: త్వరలో విజయవాడ నుంచి బెంగళూరు రాకపోకలు సాగించే వందే భారత్ రైలుకు కుప్పంలో హాల్ట్ ఇవ్వాలని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌కు రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి వినతి పత్రం అందజేశారు. కుప్పంలో వందే భారత్ రైలు నిలపాల్సిన అవసరంపై వైఎస్సార్‌సీపీ కుప్పం నియోజకవర్గ సమన్వయకర్త, ఎమ్మెల్సీ భరత్ విజ్ఞప్తి మేరకు మిథున్ రెడ్డి లేఖను రైల్వే త్రికి అందజేశారు. కుప్పం నుంచి విజయవాడకు వెళ్లేందుకు వందే భారత్ రైలు ఎక్కాలంటే 200 కిలో మీటర్లు దూరంలో బెంగళూరులోని కృష్ణరాజపురం లేక తమిళనాడులో కాట్పాడి జంక్షన్‌లకు వెళ్లి ఎక్కాల్సి ఉంటుంది. కుప్పం ప్రజల అవపరాలకు దృష్టిలో పెట్టుకుని వందే భారత్ రైలును కుప్పంలో నిలపాలని ఆయన వినతి పత్రం అందజేసినట్లు ఎమ్మెల్సీ భరత్ తెలిపారు.
ట్రయల్ రన్
గుడిపాల: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బుధవారం తమిళనాడు రాష్ట్రం వేలూరులో ఉన్న గోల్డెన్ టెంపుల్ అమ్మవారి గుడిని దర్శించుకొనేందుకు రానున్నారు. తిరుపతికి వచ్చి అక్కడి నుంచి హెలికాప్టర్ ద్వారా ఆమె విచ్చేయనున్నారు. వాతావరణం అనుకూలించక పోయినట్లయితే రోడ్డు మార్గం ద్వారా వచ్చే అవకాశం ఉంది. ఈ మేరకు ముందస్తుగా రోడ్డు మార్గాన్ని డీఎస్పీ సాయినాథ్ మంగళవారం వాహనాల ద్వారా ట్రయల్ రన్ నిర్వహించారు. చైన్నె–బెంగళూరు జాతీయ రహదారి గుడిపాల మండలం మార్గం ద్వారా సీఐ శ్రీధర్‌నాయుడు, ఎస్‌ఐ రామ్మోహన్ ఆధ్వర్యంలో ట్రయల్ రన్ చేపట్టారు.
22 నుంచి కానిస్టేబుల్
అభ్యర్థులకు శిక్షణ
చిత్తూరు అర్బన్: కానిస్టేబుల్ పోస్టులకు ఎంపికై న అభ్యర్థులకు ఈనెల 22 నుంచి శిక్షణ ప్రారంభమవుతుందని చిత్తూరు ఎస్పీ తుషార్ డూడీ తెలిపారు. ఇందుకోసం అభ్యర్థులు అన్ని ఒరిజినల్ సర్టిఫికె ట్లు, అటెస్టడ్ కాపీలు, సర్వీసు పుస్తకం, ఆరు ఫొటో లు, రూ.100 స్టాంపు పత్రాలతో 20వ తేదీ ఉద యం 9 గంటలకు చిత్తూరులోని జిల్లా పోలీసు శిక్షణా కేంద్రం (డీటీసీ)లో హాజరు కావాలని కోరారు. అదేరోజు లగేజీ సైతం తీసుకురావాలన్నారు. కానిస్టేబుల్‌గా ఎంపికై న 196 అభ్యర్థుల్లో పురుషులకు ఏటూరు జిల్లా లోని పెదవేగి పోలీసు శిక్షణా కేంద్రంలో, మహి ళలకు ఒంగోలు పోలీసు శిక్షణా కేంద్రానికి తరలిస్తామన్నారు. తొమ్మిది నెలల పాటు ఆయా కేంద్రాల్లో శిక్షణ ఉంటుందన్నారు.
కుప్పంలో వందే భారత్ రైలుకు హాల్ట్ ఇవ్వండి


