వెన్నుపోటు! | - | Sakshi
Sakshi News home page

వెన్నుపోటు!

Dec 17 2025 6:53 AM | Updated on Dec 17 2025 6:53 AM

వెన్న

వెన్నుపోటు!

● ● బహిరంగ సభల్లో ఊదరగొట్టిన చిన్నబాబు, పెదబాబు ● మీనమేషాలు లెక్కిస్తున్న కూటమి నేతలు ● అధికారంలొకొచ్చి ఏడాదిన్నర అయినా పట్టించుకోని వైనం ● ఆందోళనలో అన్నదాతలు ..కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఈ హామీలన్నీ అటకెక్కేశాయి. చెరుకు రైతుల సమస్యలు ఎక్కడవేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారిపోయాయి. ‘రైతన్న మీ కోసం’ అంటూ ఇటీవల ఓ కార్యమాన్ని పెట్టి హంగామా సృష్టించిన నేతలు వారి సమస్యలు మాత్రం పట్టించుకోలేదు. సొంత భూములున్న రైతులు వాటిని అమ్ముకుని కూలీలుగా మారిపోయారు. దర్జాగా ఉద్యోగం చేసుకుంటున్న ఫ్యాక్టరీ ఉద్యోగులు ఏపనీ లేక రోడ్డున పడ్డారు. వీరి బాధలు వర్ణనాతీతంగా ఉన్నా ఏ ఒక్కరూ కనికరించడం లేదు. చెరుకు రైతుల బకాయిలు.. వారి అవస్థలపై ‘సాక్షి’ ఫోకస్‌..

రైతుకు

చెరుకు రైతుల బకాయిలు చెల్లిస్తామంటూ బుకాయింపు

‘చెరుకు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే పరిష్కరిస్తాం’..

అంధకారంలో కార్మికుల భవితవ్యం

నేటమ్స్‌ షుగర్స్‌ ఫ్యాక్టరీలో 298 మంది ఉద్యోగులు పనిచేవారు. ఆకస్మాత్తుగా ఫ్యాక్టరీ లాక్‌డౌన్‌ ప్రకటించడంతో వారి బతుకు రోడ్డున పడింది. వారి జీతాల్లో నుంచి కోత విధించిన ప్రావిడెంట్‌ ఫండ్‌ కూడా అందలేదు. కొందరు బతుకుదెరువు కోసం ఉన్న గ్రామాన్ని వదలి సుదూర ప్రాంతాలకు వెల్లిపోయారు. ఫ్యాక్టరీ నుంచి రావాల్సిన జీతపు బకాయిలు, పీఎఫ్‌, గ్రాట్యుటీల కోసం ఫ్యాక్టరీల చుట్టు ప్రదక్షిణ చేస్తున్నారు. యాజమాన్యంపై కేసులు పెట్టినా ఇప్పటి వరకు సత్ఫలితాలు లేవు. రూ.15 కోట్ల మేర బకాయిలు అందక నరకయాతన అనుభవిస్తున్నారు.

నగరి : జిల్లాలో చెరుకు సాగు సంక్షోభంలో పడింది. గతంలో పుంగనూరు వాణి షుగర్స్‌, శ్రీకాళహస్తి మయూర, నిండ్ర నేటమ్స్‌, నెలవాయి ఎస్‌ఎన్‌జే షుగర్స్‌ ప్రైవేటు పరిశ్రమలు కాగా, రేణిగుంట, చిత్తూరులో ప్రభుత్వ కర్మాగారాలు ఉండేవి. సుమారు 40 వేల ఎకరాలకు పైగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చెరుకు పంట సాగుచేసేవారు. ఒక్క నిండ్ర నేటమ్స్‌ షుగర్‌ ఫ్యాక్టరీ పరిధిలోనే 14 వేల ఎకరాల విస్తీర్ణంలో చెరుకు పంట రైతులు సాగుచేసేవారు. అన్ని పరిశ్రమలు మూతబడి కేవలం ఒక్క పరిశ్రమ మాత్రమే ఉండడంతో చక్కెర పరిశ్రమ యాజమాన్యం చెప్పిందే వేదంగా మారిపోయింది. రైతులు చెరుకు సాగుకు సుముఖత వ్యక్తం చేయకపోవడంతో జిల్లా వ్యాప్తంగా 17వేల ఎకరాల్లో సాగులో ఉండగా నేటమ్స్‌ పరిధిలో 5వేల ఎకరాలకు పడిపోయింది. ఆరేళ్ల క్రితం క్రషింగ్‌ సీజన్‌లో చెరుకు తరలించుకొని రైతులకు బకాయిలు ఇవ్వక చేతులెత్తేయడంతో పలువురు తమ భూములను అమ్ముకున్నారు.

తగ్గిన చెరుకు సాగు విస్తీర్ణం

పడిపోయిన సాగు విస్తీర్ణం

పలు ఫ్యాక్టరీలు మూతబడడం, ఇవ్వాల్సిన బకాయిలు కూడా ఇవ్వక అప్పుల పాలుచేయడం, పండించినా జిల్లాలో తరలించేందుకు ఒక్క ఫ్యాక్టరీనే ఉండడంతో రైతులు మెలమెల్లగా చెరుకు సాగుకు స్వస్తి పలుకుతున్నారు. దీనికితోడు ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రోత్సాహకాలు లేకపోవడంతో జిల్లా లో చెరుకు సాగు ఘననీయంగా తగ్గిపోయింది.

వెన్నుపోటు! 1
1/3

వెన్నుపోటు!

వెన్నుపోటు! 2
2/3

వెన్నుపోటు!

వెన్నుపోటు! 3
3/3

వెన్నుపోటు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement