లారీని ఢీకొట్టిన బస్సు
పూతలపట్టు(యాదమరి): తిరుపతి – బెంగళూరు జాతీయ రహదారిలో ప్రయాణిస్తున్న ఓ లారీని ప్రైవేటు బస్సు ఢీకొన్న ఘటన మండలంలో చోటుచేసుకుంది. స్థానిక సీఐ గోపి కథనం.. మంగళవారం ఉదయం వేకువజామున మండల పరిధి కిచ్చన్నగారిపల్లి గ్రామ సమీపంలో నెల్లూరు నుంచి బెంగళూరుకు 27 మంది ప్రయాణికులతో ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ప్రయాణిస్తోంది. అదే సమయంలో ముందు ప్రయాణిస్తున్న లారీని అధిగమించే క్రమంలో ఢీకొంది. ఈ ప్రమాదంలో బస్సు ముందు భాగం దెబ్బతింది. అదృష్టవశాత్తు ప్రయాణికులకు ఎటువంటి గాయాలు కాలేదు. సీఐ గోపి ఆదేశాలతో ప్రయాణికులకు ఇబ్బందులు తలెత్తకుండా వారిని మరొక బస్సులో బెంగళూరుకు పంపేలా ఏర్పాట్లు చేశారు.


