సోలార్‌దే భవిత
చిత్తూరు కార్పొరేషన్: సోలార్ వాడకం భవిష్యత్‌లో పెరగనుందని కలెక్టర్ సుమిత్‌కుమార్ తెలిపారు. మంగళవారం ఇంధన పొదుపు వారోత్సవాల సందర్భంగా జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. స్థానిక వివేకానంద విగ్రహం వద్ద నుంచి గాంధీ విగ్రహం వరకు ఉద్యోగులు నినాదాలు చేసుకుంటూ వెళ్లారు. రాష్ట్రంలో భారీగా 200 మెగా వాట్స్ పీఎం కుసుం యూనిట్‌ను పెడుతున్నామన్నారు. దీని ద్వారా వ్యవసాయానికి విద్యుత్ సరఫరా చేయనున్నట్టు వెల్లడించారు. వీటితో పాటు ఇప్పటికే రుణ సదుపాయంతో సబ్సిడీ ద్వారా పీఎం సూర్యఘర్ పథకం అమలు చేస్తున్నట్టు పేర్కొన్నారు. నివాసాలతో పాటు ప్రభుత్వ కార్యాలయాల్లో పొదుపు పాటించాలన్నారు. అనంతరం ట్రాన్స్‌కో ప్రాజెక్టు డైరెక్టర్ అయూబ్‌ఖాన్ ఉద్యోగుల చేత ప్రతిజ్ఞ చేయించి మాట్లాడారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా పొదుపు పాటించాలన్నారు. సోలార్ జీఎం విజయన్, ఎస్‌ఈ ఇస్మాయిల్‌అహ్మద్, ఈఈలు మునిచంద్ర, సురేష్, భాస్కర్‌నాయుడు, పీఓ రెడ్డెప్ప, డీఈఈలు ప్రసాద్, శేషాద్రి, ఏఈలు సిబ్బంది పాల్గొన్నారు.
ర్యాలీని ప్రారంభిస్తున్న కలెక్టర్ సుమిత్‌కుమార్
ప్రతిజ్ఞ చేయిస్తున్న డైరెక్టర్ అయూబ్‌ఖాన్
సోలార్‌దే భవిత


