విక్టిమ్‌ ఎవరు? స్టేట్‌మెంట్‌ ఎక్కడ? | Magistrate questions police in NTV reporters arrest case | Sakshi
Sakshi News home page

విక్టిమ్‌ ఎవరు? స్టేట్‌మెంట్‌ ఎక్కడ?

Jan 17 2026 6:09 AM | Updated on Jan 17 2026 6:09 AM

Magistrate questions police in NTV reporters arrest case

ఎన్టీవీ రిపోర్టర్ల అరెస్టు వ్యవహారంలో పోలీసులకు మెజిస్ట్రేట్ ప్రశ్నలు

కేసులో ఫిర్యాదుదారు ఎవరు? విక్టిమే లేనప్పుడు కేసు ఎలా నమోదు చేశారు? సెక్షన్లు ఎలా పెట్టారు? 

సీనియర్‌ అధికారులైనా..

సామాన్యులైనా అందరికీ ఒకే చట్టం వర్తిస్తుందన్న మెజిస్ట్రేట్ 

రిమాండ్‌ రిక్వెస్టు తిరస్కరణ.. జర్నలిస్టులకు బెయిల్‌  

పోలీసులు, కమిషనర్‌ అత్యుత్సాహం ప్రదర్శించారంటూ జర్నలిస్టు, పౌరహక్కుల సంఘాల విమర్శలు 

సాక్షి, హైదరాబాద్‌: మంత్రి, ఐఏఎస్‌ అధికారిపై కథనాల ప్రసారానికి సంబంధించిన కేసులో.. హైదరాబాద్‌ సిటీ పోలీసులపై మెజిస్ట్రేట్ ప్రశ్నల వర్షం కురిపించారు. కేసులో ఫిర్యాదుదారు ఎవరు? విక్టిమ్‌ ఎవరు? బాధితుల స్టేట్‌మెంట్‌ ఎక్కడ? అని ప్రశ్నించారు. కేసు దర్యాప్తులో భాగంగా ఎన్టీవీ ఇన్‌పుట్‌ ఎడిటర్‌ దొంతు రమేష్ ను, రిపోర్టర్లు పరిపూర్ణాచారి, సు«దీర్‌లను సుదీర్ఘంగా విచారించిన సీసీఎస్‌ పోలీసులు చారిని మధ్యలోనే పంపించేశారు. మిగతా ఇద్దరిని సుమారు 24 గంటలపాటు విచారణ పేరుతో అదుపులో పెట్టుకున్నారు.

అనంతరం కింగ్‌కోఠిలోని ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్య పరీక్షల తర్వాత తిరిగి సీసీఎస్‌కు తీసుకొచ్చారు. అక్కడ రిమాండ్‌ రిపోర్ట్‌లో అదనంగా మరో మూ డు సెక్షన్లు జోడించారు. బుధవారం అర్ధరాత్రి 12 గంటల సమయంలో మణికొండలోని మెజిస్ట్రేట్ ఇంటికి తరలించారు. ఒంటిగంట సమయంలో రమేశ్, సు«దీర్‌లను న్యాయమూర్తి ఎదుట ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా మెజిస్ట్రేట్ అడిగిన ప్రశ్నలకు పోలీసులు సమాధానం చెప్పలేకపోయారు.  

అసోసియేషన్‌ ఫిర్యాదు మేరకు విచారణ 
పోలీసులకు పలు ప్రశ్నలు వేసిన న్యాయమూర్తి..ఎఫ్‌ఐఆర్‌లో పెట్టిన సెక్షన్లకు, రిమాండ్‌ రిపోర్ట్‌లో ఉన్న అంశాలకు సంబంధం లేదని అన్నారు. దీంతో విక్టిమ్‌ ఎవరూ లేరని, విక్టిమ్‌ స్టేట్‌మెంట్‌ ఇవ్వడానికి సిద్ధంగా లేరని, వాళ్ల అసోసియేషన్‌ ఫిర్యాదు మేరకు విచారణ చేస్తున్నామని పోలీసులు చెప్పారు. సీనియర్‌ ఐఏఎస్‌ అధికారిపై అభ్యంతరకర వార్తలు ప్రసారం చేశారని, దాంతో వారి మనోభావాలు దెబ్బతిన్నాయని, సమాజంలో తలెత్తుకోలేకపోతున్నారని అన్నారు. ఈ కేసులో మరింత విచారణ జరపాల్సి ఉందంటూ రిమాండ్‌ విధించాలని పీపీ కోరారు.  

నిరాధారమైన ఆరోపణలతో అరెస్టు 
ఎన్టీవీ రిపోర్టర్ల తరఫు న్యాయవాదులు కిరణ్, జగదీశ్, శేరియార్‌ వాదిస్తూ..పోలీసులు చట్టవిరుద్దంగా చర్యలు చేపట్టడం దారుణమని  అన్నారు. ఈ కేసులో పెట్టిన కొన్ని సెక్షన్లు ఏడేళ్ల లోపువే ఉన్నాయని, ఈ కేసులో బాధితుల పేర్లు లేవని, వారి నుంచి ఎలాంటి స్టేట్‌మెంట్‌ కూడా పోలీసులు రికార్డు చేయలేదని తెలిపారు. పోలీసులు ఎలాంటి విచారణ చేయకుండానే అరెస్టు చేశారన్నారు. అధికారిక పర్యటన కోసమే దొంతు రమేష్‌ విదేశాలకు వెళ్తున్నారని, కుటుంబాన్ని తీసుకుని ముందుగా బ్యాంకాక్‌ వెళ్లి, ఆ తర్వాత దావోస్‌లోని వరల్డ్‌ ఎకనమిక్‌ ఫోరం సదస్సులో పాల్గొనేందుకు వెళ్తున్న క్రమంలో అదుపులోకి తీసుకున్నారని చెప్పారు.

నిరాధారమైన ఆరోపణలతో అరెస్టు చేశారని వాదించారు. ఈ వాదనలతో ఏకీభవించిన మేజి్రస్టేట్‌.. పోలీసుల రిమాండ్‌ రిక్వెస్ట్‌ను తిరస్కరిస్తున్నట్టు తెలిపారు. ‘విక్టిమే లేనప్పుడు కేసు ఎలా నమోదు చేశారు..? సెక్షన్లు ఎలా పెట్టారు..?  సీనియర్‌ అయినా.. జూనియర్‌ అయినా.. ఐఏఎస్‌ అయినా.. అందరికీ ఒకే చట్టం వర్తిస్తుంది. సదరు అధికారుల కోసం ప్రత్యేక చట్టాలు ఏం లేవు. కాబట్టి రిమాండ్‌ రిక్వెస్ట్‌ను రిజెక్ట్‌ చేస్తున్నాం..’ అని మెజిస్ట్రేట్ స్పష్టం చేశారు. సు«దీర్, రమేష్ లకు బెయిల్‌ మంజూరు చేశారు. వారు తమ పాస్‌పోర్ట్‌లు సరెండర్‌ చేయాలని, రూ.20 వేల విలువైన రెండు షూరిటీలు సమరి్పంచాలని ఆదేశించారు.  

అరెస్టులు ఖండించిన జర్నలిస్టు సంఘాలు 
    ఎన్టీవీ రిపోర్టర్లను అరెస్టు చేయడంలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జర్నలిస్టుల అరెస్టును పలు జర్నలిస్టు సంఘాలు, పౌరహక్కుల సంఘాలు ఖండించాయి. పోలీసులు వ్యవహరించిన తీరును తప్పుబట్టాయి. ఐఏఎస్‌పై కథనానికి సంబంధించి ఈనెల 10న ఎన్టీవీ తోపాటు తెలుగు స్క్రైబ్, ఎమ్‌ఆర్‌ మీడియా తెలంగాణ, ప్రైమ్‌ 9, పీవీ న్యూస్, సిగ్నల్‌ టీవీ, వ్లోగా టైమ్స్, మిర్రర్‌ టీవీ, టీ న్యూస్‌ తెలుగు ఛానల్స్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఏ–1 గా ఎన్‌టీవీని చేర్చారు.

ఆ తర్వాత ఇదే తరహా మరో కేసును కలిపి రెండు కేసుల దర్యాప్తును ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌)కు అప్పగిస్తూ డీజీపీ బి.శివధర్‌రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఈ సిట్‌ దర్యాప్తు పర్యవేక్షణను హైదరాబాద్‌ సిటీ సీపీ వీసీ సజ్జనార్‌కు అప్పగించారు. ఈ నేపథ్యంలో ఈనెల 13న రాత్రి 11 గంటలకు శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌లో దొంతు రమేష్ ను అరెస్టు చేసి నేరుగా సీసీఎస్‌కు తరలించారు. అదేరోజు రాత్రి 12 నుంచి 2 గంటల మధ్య మరో ఇద్దరు ఎన్టీవీ రిపోర్టర్లు సు«దీర్, పరిపూర్ణాచారిని వాళ్ల ఇంటి వద్ద అదుపులోకి తీసుకున్నారు. ఈ సమయంలోనే రిపోర్టర్‌ సు«దీర్‌ ఇంటి వద్ద హైడ్రామా నడిచింది. ఒక దశలో ఇంటి తలుపులు బద్ధలు కొడతామంటూ పోలీసులు బెదిరించినట్లు రిపోర్టర్లు చెప్పారు.

చివరకు సు«దీర్, చారి, రమేష్‌ ముగ్గురిని బషీర్‌బాగ్‌ సీసీఎస్‌ కార్యాలయానికి తరలించారు. ఓ వైపు సీసీఎస్‌లో విచారణ జరుగుతుండగానే.. ఎన్‌టీవీ సీఈఓ ఇంటికి, యాంకర్‌ దేవి ఇంటికి మరికొన్ని పోలీస్‌ బృందాలను పంపారు. అక్కడ కూడా పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించినట్లు జర్నలిస్టు వర్గాల సమాచారం. దేవి, రాజశేఖర్‌ ఎక్కడ అని ప్రశ్నిస్తూ.. అర్జెంట్‌గా తమ ముందు హాజరవ్వాలని.. లేకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయంటూ హెచ్చరించినట్లు తెలిసింది. సాక్షిగా స్టేట్‌మెంట్‌ ఇచి్చన యాంకర్‌ దేవిని కూడా ఇబ్బంది పెట్టినట్లు రిపోర్టర్లు తెలిపారు. 

కమిషనర్‌ సజ్జనార్‌ తీరుపై విస్మయం 
    ఎన్టీవీ కథనంపై కేసు, రిపోర్టర్ల అరెస్టు వ్యవహారంలో నగర పోలీసు కమిషనర్‌ వీసీ సజ్జనార్‌ వ్యవహరించిన తీరుపై జర్నలిస్టు సంఘాలు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. రిపోర్టర్ల అరెస్టు విషయంలో ఆయన మీడియాతో ఆగ్రహంగా బెదిరించేలా మాట్లాడారనే విమర్శలు విన్పిస్తున్నాయి. ‘సిట్‌ అంటేనే దర్యాప్తు..ఎందుకు నోటీసులు ఇవ్వాలండి...కావాల్సిన వాళ్లను పిలిపిస్తాం. మేము పిలిస్తే రావాల్సిందే..మీ దగ్గర ఆధారాలు ఉంటే వచ్చి చూపండి.. ఎందుకు పారిపోతున్నారు? ఎక్కడ ఉన్నా పట్టుకుని వస్తా. చట్టం ముందు ప్రవేశపెడ్తా..’ అంటూ సజ్జనార్‌ ఆవేశంగా మాట్లాడటాన్ని పలువురు సీనియర్‌ జర్నలిస్టులు తప్పుపడుతున్నారు. కేసు విచారణ జరుగుతున్న సమయంలోనే రిపోర్టర్లు తప్పు చేశారనే విధంగా తీర్పునిచ్చేలా మాట్లాడడంపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.  

ఎడిటర్లు ఎక్కడ? ఇన్‌చార్జిలు ఎక్కడ? 
విచారణలో భాగంగా ఎన్‌టీవీ ఆఫీస్‌లోకి వెళ్లిన ఇన్‌స్పెక్టర్‌తో పాటు మరో ఆరుగురితో కూడిన బృందం.. ఎడిటర్లు ఎక్కడ?  ఇన్‌చార్జిలు ఎక్కడ..? అంటూ సిబ్బందిని ప్రశ్నించారు. హార్డ్‌ డిస్‌్కలు, సీపీయూలు సీజ్‌ చేస్తామని, సర్వర్‌ వైర్లు లాగేస్తామని బెదిరింపులకు పాల్పడినట్లు అక్కడి సిబ్బంది తెలిపారు. సీఈఓ, దేవి, రాంబాబు.. ఎక్కడున్నారో చెప్పకపోతే, ఇక్కడున్న మిమ్మల్ని అదుపులోకి తీసుకోవాల్సి వస్తుందంటూ భయబ్రాంతులకు గురిచేశారని వారు వాపోయారు. సెర్చ్‌ వారెంట్‌ ఉందా..? అని గట్టిగా నిలదీయడంతో పోలీసులు వెనుదిరిగారని,  కాసేపటికి తిరిగి వచి్చన పోలీసులు రిక్వెస్ట్‌ లెటర్‌ ఇచ్చి ఓ సీపీయూ సీజ్‌ చేశారని తెలిపారు. ఇలావుండగా తెలుగుదేశం సోషల్‌ మీడియా ఎన్టీవీ చైర్మన్‌ నరేంద్ర చౌదరి బ్యాంకాక్‌ పారిపోయారంటూ దు్రష్పచారాన్ని ప్రారంభించింది. అయితే ఆయన మూడు రోజులుగా కార్యాలయానికి వస్తూనే ఉన్నారని ఎన్టీవీ రిపోర్టర్లు తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement